BigTV English

BRS MP Candidates : మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..

BRS MP Candidates : మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..

KCR latest news


BRS MP Candidates list(Political news today telangana): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్నారు. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

మల్కాజ్ గిరి స్థానంపై ఉత్కంఠ వీడింది. బీఆర్ఎస్ టిక్కెట్ ను రాగిడి లక్ష్మారెడ్డికి కేసీఆర్ ఇచ్చారు. ఆదిలాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ఆంత్రం సక్కుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు మొత్తం 11 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. మరో 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.


వరంగల్‌ అభ్యర్థిగా కడియం కావ్య, చేవెళ్ల అభ్యర్థిగా కాసానికి జ్ఞానేశ్వర్ , జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనికుమార్ , నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేర్లను ఇప్పటికే ప్రకటించారు.  అలాగే పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్,  మహబూబాబాద్ నుంచి మలోత్ కవిత, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి , ఖమ్మ నుంచి నామా నాగేశ్వరరావును బరిలోకి దించాలని నిర్ణయించారు.

Also Read : డీకే శివకుమార్ ను కలిసిన మల్లారెడ్డి..! కాంగ్రెస్ లోకి చేరతారా..

నల్లొండ , భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్ , నాగర్ కర్నూల్  స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అక్కడ కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది.  అలాగే నాగర్ కర్నూలు ఎంపీ రాములు కారు దిగిపోయారు. అక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని వెతకాల్సిన పరిస్థితి ఉంది.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×