Big Stories

Israel PM Benjamin: ఇజ్రాయెల్ సైనికులపై అమెరికా ఆంక్షలు.. ‘ఇదో పిచ్చి చర్య’

Israel PM Benjamin: యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్)కు చెందిన నెత్జా యెహుదా బెటాలియన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది.

- Advertisement -

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు చెందిన నెత్జా యోహూదా బెటాలియన్ పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించింది. నెత్జా యోహుదా బెటాలియన్ పై అమెరికా ఆంక్షలు విధించడాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు.

- Advertisement -

ప్రస్తుతం ఇజ్రాయెల్ ఢిపెన్స్ ఫోర్సెస్ పై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని నెతన్యాహు అమెరికాను కోరారు. తమ సైనికులు ఉగ్రవాదులతో భీకర పోరును కొనసాగిస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఐడీఎఫ్ కు సంబంధించిన సైనిక బెటాలియన్ పై ఆంక్షలు విధిచడం సరికాదన్నారు. ఇది పూర్తిగా అనైతికమని మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

వెస్ట్ బ్యాంక్ లో పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘనకు ఈ బెటాలియన్ సైనికులు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అమెరికా ఆ సైనిక బెటాలియన్ పై ఆంక్షలు విధించింది. అయితే ఆ చర్యను ఇజ్రాయెల్ మంత్రి ఇటమార్ బెన్ జివిర్ కూడా తప్పుపట్టారు.

Also Read: చైనాకు షాక్ ఇచ్చిన అమెరికా.. పాక్‌కు సాయం చేసిన కంపెనీలపై నిషేధం

తమ సైనికులపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. నెట్జా యెహుదా సైనికులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని.. యూఎస్ చర్యలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవద్దని సూచించారు. తన సైనికులపై అమెరికా ఆంక్షలు విధించడమనేది.. ఓ పిచ్చి పనిగా ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ ట్వీట్టర్ వేదికగా ఖండించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News