BigTV English

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోవాలి..లేదంటే జేబుకు చిల్లే..!

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోవాలి..లేదంటే జేబుకు చిల్లే..!

Personal Loan: ప్రస్తుత రోజుల్లో పర్సనల్ లోన్స్ లేని ఉద్యోగులు దాదాపు లేరనే చెప్పవచ్చు. అనేక మంది వారి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి లోన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈ లోన్స్ తీసుకునే విషయంలో మాత్రం కొన్ని విషయాలు తెలుసుకోకుంటే, మీరు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, వ్యక్తిగత రుణం తీసుకునే ముందు మీరు అన్ని విషయాలను క్లియర్‌గా తెలుసుకుని, ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.


1. వడ్డీ రేటు (Interest Rate)

పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేటు అత్యంత కీలకమైన అంశం. ఇది మీరు మొత్తం ఎంత చెల్లించాల్సి వస్తుందో నిర్ణయిస్తుంది. సాధారణంగా బ్యాంకులు, NBFCలు పాత కస్టమర్లకు తక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. కొత్త కస్టమర్లకు ఎక్కువ వడ్డీ ఉండే అవకాశముంది. కనుక, లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల, NBFCల వడ్డీ రేట్లను పోల్చి తక్కువ వడ్డీ రేటు ఉన్న లోన్ తీసుకోవాలి.


2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సౌకర్యం

ప్రస్తుతం చాలా బ్యాంకులు, NBFCలు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత రుణాన్ని అందిస్తున్నాయి. దీంతో కస్టమర్ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లకుండానే రుణాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా, మీకు ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతా ద్వారా రుణం తీసుకుంటే, కొత్తగా మరిన్ని డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

3. తిరిగి చెల్లింపు సౌకర్యం (EMI Options)

రుణం తీసుకునే ముందు, తిరిగి చెల్లించే విధానాన్ని కూడా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు తీసుకున్న రుణాన్ని మీరు ఎన్ని నెలల్లో లేదా ఎన్ని ఏళ్లలో తిరిగి చెల్లించగలరో ముందుగానే అంచనా వేసుకోవాలి.
EMI గణనలో కీలక అంశాలు:
-రుణ కాలపరిమితి (Loan Tenure)
-నెలవారీ వడ్డీ (Interest per month)
-ప్రిన్సిపల్ అమౌంట్ (Principal Amount)
-ఎక్కువ కాలపరిమితితో రుణం తీసుకుంటే, EMI తక్కువ అవుతుంది. కానీ మొత్తం వడ్డీ రుసుములు పెరుగుతాయి.

Read Also: Redmi A4 5G: అద్భుతమైన ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్..భారీ

4. రుణ రుసుములు, అదనపు ఛార్జీలు
ఒక వ్యక్తిగత రుణం తీసుకునేటప్పుడు, కొన్ని అదనపు రుసుములను బ్యాంకులు, NBFCలు వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలను ముందుగానే పరిశీలించడం చాలా అవసరం.

ప్రధానంగా ఉండే రుసుములు:
ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తం 1% – 3% వరకు ఉండొచ్చు.
ప్రీ-క్లోజర్ ఛార్జ్: ముందుగానే రుణాన్ని తిరిగి చెల్లిస్తే, కొన్ని బ్యాంకులు అదనపు ఫీజు విధిస్తాయి.
లేట్ పేమెంట్ ఫీజు: EMI సమయానికి చెల్లించకపోతే, అదనపు జరిమానా ఉంటుంది.
-ఈ క్రమంలో బ్యాంకు లేదా NBFC టర్మ్స్ అండ్ కండిషన్లను పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాకే రుణం తీసుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి.

5. NBFC లేదా బ్యాంక్ వెరిఫికేషన్
ఈ రోజుల్లో చాలా NBFCలు అత్యంత వేగంగా రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. కానీ, కొన్ని NBFCలు కస్టమర్‌కి అధిక వడ్డీ, అదనపు ఛార్జీలు, బలవంతపు వసూళ్లు వంటి సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి, రుణం తీసుకునే ముందు ఆ సంస్థ విశ్వసనీయత గురించి కూడా ఓసారి తెలుసుకోవాలి.

6. క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత
మీ క్రెడిట్ స్కోర్ మీ రుణ అనుమతికి చాలా కీలకం. సాధారణంగా, బ్యాంకులు, NBFCలు 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉన్న వారికి తక్కువ వడ్డీ రేటుతో రుణం ఆఫర్ చేస్తాయి. కనుక, మీరు రుణం తీసుకోవడానికి ముందుగా మీ CIBIL స్కోర్ చెక్ చేసుకోవడం మంచిది.

Related News

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Big Stories

×