Betting Apps Case..బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ను ఒక్కొక్కరిగా ఏరిపారేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మొత్తం 11మంది యూట్యూబర్ లపై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు.. హర్ష సాయి, సుప్రీత, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, టేస్టీ తేజ, అజయ్, భయ్యా సన్నీ యాదవ్, సుదీర్ రాజు, కిరణ్ గౌడ్ లపై కేసు నమోదు అయింది. వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లపై ఇప్పుడు కేసు నమోదు అయింది. ఇకపోతే సిటీ పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో టాప్ సెలబ్రిటీలు కూడా ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని నెటిజన్స్ కూడా వీరిపై ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం. అంతేకాదు వీరినా.. ఇన్ని రోజులు అభిమాన సెలబ్రిటీలుగా అభిమానించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
బలవుతున్న పేద ప్రజలు..
ప్రత్యేకించి కొంతమంది యూట్యూబర్స్ లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న తర్వాత..బెట్టింగ్ కంపెనీలతో ఒప్పందం తీసుకొని, కోట్ల రూపాయలను పోగేసుకుంటూ ఆ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఇక అభిమాన సెలబ్రిటీలను నమ్మిన చాలా మంది ప్రజలు వీరు చెప్పే మాటలను నమ్మి.. లక్షల రూపాయలను ఆ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడిగా పెట్టి మోసపోతున్నారు. చివరికి మోసపోయామని తెలిసిన తర్వాత అప్పు చేసి పెట్టిన వారు.. అప్పు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
బెట్టింగ్ భూతాన్ని తరిమేద్దాం – వీసీ సజ్జనార్
ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ భూతాన్ని తరిమేద్దామని ఐఏఎస్ వీసీ సజ్జనార్ రంగంలోకి దిగారు. ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు తెలిసిన వెంటనే తనకు నేరుగా స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టాలి అని కోరారు. సమాజం యొక్క భవిష్యత్తుకు పాటుపడాలని ఎంతోమంది యువతకు పిలుపునిచ్చారు. బెట్టింగ్ భూతాన్ని తరిమేద్దాం అంటూ కోరారు. ఇక ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 74 మందిని ఐడెంటిఫై చేయడం.. అందులో దాదాపు 11 మందిపై కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే అందులోనూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సెలబ్రిటీలు ఉండడం గమనార్హం. ప్రస్తుతం వీరందరినీ జైల్లో వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రజల మానసిక బలహీనతను దృష్టిలో పెట్టుకొని డబ్బును మొదట ఎరగా వేసి.. ఆ డబ్బుతోనే వారి జీవితాలను నాశనం చేస్తున్న ఇలాంటి యూట్యూబర్ లకు కఠిన శిక్ష విధించాలని పలువురు నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరందరూ ఒక్కొక్కరుగా తమ తప్పు తెలుసుకొని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Bulli Raju: వెంకటేష్ కొడుకు డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?