OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలకి మన ప్రేక్షకులు ఎప్పటినుంచో అభిమానులుగా ఉన్నారు. మంచి కంటెంట్ తో వచ్చిన రొమాంటిక్ సినిమాలకి, ఆస్కార్ అవార్డులు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఏకంగా ఐదు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకుంది. ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్ అవార్డును అందుకోవడం విశేషం. ఎందుకంటే ఈమె చేసిన వేశ్య పాత్రకి ఈ అవార్డ్ వచ్చింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జియో హాట్ స్టార్ (Jio hotstar)
2024 లో వచ్చిన ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘అనోర’ (Anora). ఈ సినిమాలో మైకీ మ్యాడిసన్, మార్క్ ఇడిల్‍స్టెయిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి సీన్ బేకర్ దర్శకత్వం వహించటంతో పాటు స్క్రీన్‍ప్లే, ఎడిటింగ్ కూడా చేశారు. ఈ మూవీని రొమాంటిక్ కామెడీ డ్రామా గా దర్శకుడు తెరకెక్కించారు. హీరోయిన్ ఒక వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు మోతాదుకు మించి ఉంటాయి. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో రష్యా కు చెందిన ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు. అక్కడ బాధ్యతల నుంచి పారిపోయి అమెరికాకి వస్తాడు. అమెరికాలో ఒక క్లబ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ క్లబ్ లోనే హీరోయిన్ కూడా ఉంటుంది. ఆమె డబ్బున్న వ్యక్తుల దగ్గర వేశ్యగా ఉంటుంది. ఈ క్రమంలోనే డబ్బు కోసం హీరోతో రొమాన్స్ చేస్తుంది. హీరో ఆమె చేసిన రొమాన్స్ కి ఫిదా అయిపోతాడు. విఐపి సేవలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్తుంది. ఆ తర్వాత ఆమెను తన ఇంటికి పిలుచుకొని మళ్లీ రొమాన్స్ చేస్తాడు హీరో. ఇక ఆమెతో ఎప్పుడూ అదే పనిలో ఉంటాడు. హీరో రిచ్ లైఫ్ చూసి హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హీరో ఆమెకు అసలు విషయం చెప్తాడు. తాను ఒక గొప్ప ధనవంతుడి కొడుకుని చెప్పడంతో, ఆమె కూడా అతనితో సరదాగా గడుపుతుంది. అలా వీళ్లు ఒక లాంగ్ ట్రిప్ కి కూడా వెళ్తారు. ఆ ట్రిప్ లోనే వీళ్లిద్దరు పెళ్ళికి కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఒక వేశ్య ధనవంతులు కుటుంబానికి కోడలు అవుతుంది. ఈ విషయం హీరో తల్లిదండ్రులకు తెలుస్తుంది. తల్లిదండ్రులు వస్తున్నారనే విషయం తెలిసి హీరో పారిపోతాడు. హీరోయిన్ ను విడాకులు తీసుకోమని ఒత్తిడి చేస్తారు. నీలాంటి అమ్మాయిని కోడలిగా ఒప్పుకోలేమని వాళ్ళు చెప్తారు. హీరో కూడా ఎంజాయ్ కోసమే పెళ్లి చేసుకున్నానని ఒప్పుకుంటాడు. చివరికి హీరోయిన్ ఎటువంటి నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలనుకుంటే, ‘అనోర’ (Anora) అనే ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.