Today Gold Price: గోల్డ్ కొనుగోలు చేసే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. గత కొద్దిరోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో కొన్ని మార్పులు రావడంతో.. ఆ ప్రభావం గోల్డ్‌పై పడింది. యూఎస్‌లో జనవరి ద్రవ్యోల్భణం పెరిగిన నేపథ్యంలో రిటైల్ సేల్స్ పడిపోయాయి. దీంతో అమెరికా ఫెడ్ రేట్లను తగ్గించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో పసిడి ధరలు సడెన్‌గా తగ్గుముఖం పట్టాయిని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్న పసిడి ధరలతో ఇన్వెస్టర్లు ఫ్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. దీంతో గోల్డ్ రేట్స్(Gold Price) ఒక్కసారిగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో గోల్డ్ స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో గోల్డ్ షాపులకు కొనుగోలుదారులు బారులు తీరారు. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడం పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు(ఫిబ్రవరి 26th) బంగారం ధరలు చూస్తే దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,900 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.86,070 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్, తెలంగాణలో రూ.78,900 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,070 ఉంది.
22 క్యారెట్ల తులం బంగారం ధర విజయవాడ, గుంటూరులో రూ.78,900 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,070 కి చేరుకుంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ప్రైజ్ రూ.78,900 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,070 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం గోల్డ్ ప్రైజ్ రూ.86,220 పలుకుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,900 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,070 వద్ద ట్రేడింగ్‌లో ఉంది
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,900 కి చేరగా.. 10 గ్రాముల గోల్డ్ ప్రైజ్ రూ.86,070కి చేరుకుంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైజ్ రూ.78,900 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,070 వద్ద కొనసాగుతోంది.
కోల్ కతా, కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,900 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,070 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: ఆదాయపు పన్ను సేవింగ్స్ కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,08,000 ఉంది.
ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,,00,500 వద్ద కొనసాగుతోంది.