BigTV English

Fake Insurance Agents : ఆదాయపు పన్ను సేవింగ్స్ కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!

Fake Insurance Agents : ఆదాయపు పన్ను సేవింగ్స్ కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!

Income Tax Savings Fake Insurance Agents | వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా కోసం వివిధ పెట్టుబడుల్లో పెట్టుబడులు పెడతారు. అలాగే ఇన్సూరెన్స్ ద్వారా కూడా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడే సమయంలో చాలా మంది పన్ను ఆదా పెట్టుబడులు చేయడానికి హడావిడి పడుతుంటారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మార్కెట్లో నకిలీ ఏజెంట్ పుట్టుకొస్తున్నారు. బీమా పాలసీలు కొనుగోలు చేస్తే పన్ను మినహాయింపులు పొందవచ్చని వారు ప్రజలను సునాయాసంగా మభ్యపెడుతున్నారు. అయితే.. ఇటువంటి వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. అందుకే పన్ను చెల్లింపుదారులు, బీమా కొనుగోలుదారులకు ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు కొని సూచనలు చేస్తున్నాయి.


నకిలీ ఏజెంట్ల మోసాలు
తక్కువ ప్రీమియం, ఎక్కువ లాభాలు: తక్కువ ప్రీమియం చెల్లించినా భవిష్యత్తులో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి పాలసీలను అమ్మడానికి ప్రయత్నిస్తారు. ప్రత్యేక రాయితీలు, ఎక్కువ లాభాల వాగ్దానాలు చేస్తారు. ఇది మోసం చేసే ప్రయత్నమే. బీమా కంపెనీలు ఎప్పుడూ అధిక రాబడికి హామీ ఇవ్వవు.

నగదు లేదా వ్యక్తిగత ఖాతాలకు చెల్లింపులు: బీమా పాలసీల కోసం ప్రీమియం మొత్తాన్ని ఆన్‌లైన్‌ వేదికల ద్వారా లేదా చెక్కు రూపంలో మాత్రమే చెల్లించాలి. ఇది సంబంధిత కంపెనీ పేరుతోనే జరగాలి. నగదు లేదా వ్యక్తిగత ఖాతాలకు చెల్లించమని కోరితే అది మోసం అని అర్థం చేసుకోవాలి.


సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు లేకపోవడం: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ గుర్తింపును తెలియజేస్తారు. ఇలాంటి గుర్తింపు లేని ఏజెంట్లను అనుమానించాలి.

తొందరపాటుతో మభ్యపెట్టడం : “ఈ పాలసీ ఈ రోజే ముగుస్తుంది”, “ఇప్పుడు చెల్లించకపోతే అవకాశం కోల్పోతారు” వంటి మాటలు నకిలీ ఏజెంట్లు చెబుతారు. బీమా పాలసీలు తీసుకోవడానికి నిర్దిష్ట గడువు అనేది లేదు. కొన్ని పాలసీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

సమాచారం లేకుండా చెల్లింపులు చేయడం: బీమా సంస్థ, పాలసీ పేరు, ఇతర వివరాలు తెలుసుకోకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రీమియం చెల్లించకూడదు. బీమా సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ లేదా సహాయ కేంద్రంలో పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

Also Read:  టీ అమ్ముతూ.. రూ.10 వేల కోట్లు సంపాదించాడు.. బిజినెస్ ఐడియా పవర్ మరి!

నకిలీ ఇన్సూరెన్స్ కంపెనీలు

మార్కెట్లో నకిలీ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. వీటి పేర్లు కూడా చాలా మంది సరిగా విని ఉండరు. చిన్న వ్యాపారస్థులు, డబ్బు దాచుకోవాలనుకునే వ్యక్తులు ఈ నకిలీ కంపెనీల లక్ష్యం. ఈ కంపెనీల కోసం నకిలీ ఏజెంట్లు పనిచేస్తుంటారు. వారు ఊళ్లో ఎవరో ఒకరి ద్వారా వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత వారితో స్నేహంగా ప్రవర్తిస్తూ, తాము పేరు మోసిన బీమా సంస్థలో ఏజెంట్ గా పనిచేస్తున్నామని చెప్పి, పాలసీలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మోసగిస్తారు.

చిన్న వ్యాపారస్థులు.. ఈ మోసగాళ్ల మాటలకు మోసపోతారు. వారు తమ బీమా సంస్థలో సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి నమ్మించేస్తారు. ఎదుటివారి బలహీనతను ఆసరా చేసుకుని, వారికి ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా ఈ ఫేక్ ఏజెంట్లు పాలసీలు కట్టించుకునేలా చేస్తారు. పూర్తి షరతులను చెప్పకుండా, వారికి అనుకూలంగా ఉన్న వివరాలు మాత్రమే చెబుతారు.

చెల్లింపులు చేశాక ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అది తమకు సంబంధం లేని విషయమని చెప్పి, హెడ్ ఆఫీస్‌కు వెళ్లమని దబాయిస్తారు. ఇలా మోసపోయిన వ్యక్తులు తమ డబ్బును తిరిగి పొందలేక బాధపడుతున్నారు.

ఇన్సూరెన్స్ పాలసీల గురించి
ఇన్సూరెన్స్ పాలసీలు అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. భవిష్యత్తులో ఏదైనా అనిశ్చితి ఎదురైతే, కుటుంబానికి ఆసరా కావాలని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. మార్కెట్‌లో పేరు గాంచిన సంస్థల ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, వారి నిబంధనలు సక్రమంగా ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో నిబంధనలు పాటించని వారికి పాలసీలు ఇవ్వకపోవడం గమనార్హం.

పాటించాల్సిన జాగ్రత్తలు:
అధికారిక వెబ్‌సైట్ నుండి సమాచారం: బీమా సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా సహాయ కేంద్రం నుండి పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

నగదు చెల్లింపులు నివారించండి: ప్రీమియం చెల్లింపులు ఆన్‌లైన్‌ లేదా చెక్కు ద్వారా మాత్రమే చేయాలి.

అనుమానాస్పద వ్యక్తులను నివారించండి: సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు లేని ఏజెంట్లను అనుమానించాలి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి: “ఇప్పుడే చేయాలి” అనే ఒత్తిడిని నివారించండి. పాలసీలు తీసుకోవడానికి నిర్దిష్ట గడువు అనేది లేదు.

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా, మోసగాళ్ల నుండి దూరంగా ఉండి, సురక్షితంగా బీమా పాలసీలు తీసుకోవచ్చు.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×