Hair Fall Control: ఈ రోజుల్లో జుట్టు రాలడం సమస్య మహిళలనే కాదు పురుషులను కూడా ఇబ్బంది పెడుతోంది. మారుతున్న జీవనశైలి , ఒత్తిడి కారణంగా ఈ సమస్య పెరుగుతోంది. పురుషులలో జుట్టు రాలడం ఒక సాధారణ అయినప్పటికీ ఈ సమస్య మీ రూపాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. చాలా మంది జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సార్లు ఎలాంటి హెయిర్ ప్రొడక్ట్స్ వాడినా కూడా ఫలితం ఉండదు. ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన పోషకాహారం తినడం కూడా అవసరం. పురుషుల్లో జుట్టు రాలడం సమస్య నుండి బయటపడటానికి మీకు సహాయపడే కొన్ని ప్రభావ వంతమైన హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలడాన్ని ఎలా ఆపాలి ?
వయసు పై బడుతున్నా కొద్దీ జుట్టు రాలడం చాలా కామన్. కానీ ముందే జుట్టు రాలిపోవడం ప్రారంభిస్తే అది మీకు ఆందోళన కలిగించే విషయంగా మారుతుంది. పురుషులలో జుట్టు రాలడం, బట్ట తల సమస్య నుండి బయటపడటానికి ఈ హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి.
జుట్టుకు నిమ్మకాయను వాడండి:
నిమ్మకాయ అనేది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే సహజ నివారణగా పనిచేస్తుంది. నిమ్మ రసంలో ఉండే విటమిన్ సి ,యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి . అంతే కాకుండా జుట్టును కూడా బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడే వారు పెరుగులో నిమ్మకాయ వేసి జుట్టుకు అప్తై చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం జుట్టు ఆరోగ్యానికి ఒక పురాతనమైన , ప్రభావ వంతమైన హోం రెమెడీ. ఇందులో ఉండే సల్ఫర్ ,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జుట్టు మూలాలకు పోషణను అందిస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడం, చుండ్రు , తలపై ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. ఫలితంగా జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. తరచుగా ఉల్లిపాయ రసం వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కొత్తిమీర :
కొత్తిమీర జుట్టు ఆరోగ్యానికి సహజ ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే విటమిన్లు , ఖనిజాలు జుట్టుకు పోషణనిచ్చి పెరుగుదలకు ఉపయోగపడతాయి. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొత్తి మీర ఉపయోగించడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా పెరిగేందుకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: ఈ నేచురల్ హెయిర్ కలర్‌తో.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం
జుట్టుకు వేప ఆకులు ,ఉసిరి పొడి
జుట్టు రాలడాన్ని నివారించడంలో వేప ఆకులు , ఉసిరి పొడి ఉపయోగపడతాయి. జుట్టును బలోపేతం చేయడానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తరచుగా వాడటం కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయవచ్చు.
వెల్లుల్లి:
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వెల్లుల్లి ఉపయోగించడం చాలా మంచిది. దీనిలో ఉండే విటమిన్లు , పోషకాలు జుట్టుకు బలాన్ని ,మెరుపును అందిస్తాయి. అంతే కాకుండా వెల్లుల్లిని ఆయిల్ లో వేసి వాడటం వల్ల కూడా బట్ట తల రాకుండా ఉంటుంది.