BigTV English

Kalyan Dev: మళ్లీ ప్రేమలో పడ్డ మెగా అల్లుడు..!

Kalyan Dev: మళ్లీ ప్రేమలో పడ్డ మెగా అల్లుడు..!

Kalyan Dev:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ (Sreeja ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమె సినిమాలలోకి రాకపోయినా.. వ్యక్తిగత కారణాలతోనే ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఫ్యామిలీలో పుట్టిన ఈమె, తన మొదటి ప్రేమ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కుటుంబ సభ్యులను ఎదిరించి ,తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. అంతేకాదు తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, తన బాబాయ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక కుటుంబాన్ని కాదనుకొని అతడితో వెళ్లిపోయి,ఒక కూతురు పుట్టాక అతడికి విడాకులు ఇచ్చి, మళ్లీ తండ్రి చెంతకు చేరింది. దీంతో ఆయన శ్రీజను తన కోరిక మేరకు కళ్యాణ్ దేవ్ (Kalyan Dev) కి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వీరి వివాహానికి గుర్తుగా ఒక కూతురు పుట్టింది.


శ్రీజ – కళ్యాణ్ దేవ్ పెళ్లి, విడాకులు..

ఇక మామ చిరంజీవి ప్రోత్సాహంతో కళ్యాణ్ దేవ్ కూడా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఏమైందో తెలియదు కానీ సడన్ గా శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకొని విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపోతే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన విడుదల చేయకపోయినా.. విడాకుల వార్తా సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారుతోంది. ఇక వీరి బంధానికి గుర్తుగా పుట్టిన పాప కూడా చిరంజీవి దగ్గరే ఉంది. కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతుర్ని వారానికి ఒకసారి కలుస్తూ.. పలు భావోద్వేగ పోస్టులతో అందరినీ కంటతడి పెట్టిస్తూ ఉంటారు. ఇకపోతే ఒకప్పుడు తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను, అలాగే తన బ్రాండ్ ప్రమోషన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసే ఈయన.. గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయారు. ఇక దీంతో కళ్యాణ్ దేవ్ ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం లేదని అభిమానులు కూడా అనుకున్నారు.


మళ్లీ ప్రేమలో పడ్డ కళ్యాణ్ దేవ్..

అయితే మళ్లీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు కళ్యాణ్ దేవ్. తన కూతురితో ఉన్న ఫోటోతో పాటు హార్ట్ సింబల్, కాఫీ అలాగే గులాబీ పువ్వులను షేర్ చేస్తూ.. “నేను ఎప్పుడూ కూడా ప్రేమనే ఎంచుకుంటాను. మీరు అలాగే చేస్తారా? అంటూ ఒక క్యాప్షన్ జోడించారు. దీంతో కళ్యాణ్ దేవ్ మళ్లీ ప్రేమలో పడ్డాడని అందరూ పలు రకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తూ ఈ విషయంపై చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈ విషయాన్ని శ్రీజకి తెలిసేలా చేయాలని, ఈ పోస్ట్ పెట్టి ఉంటాడని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం ఉంది? ఎంత నిజం ఉంది ? అనే విషయం తెలియదు కానీ కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇకపోతే ఈ ఫోటోలలో చిరంజీవి చిన్న మనవరాలు, శ్రీజ – కళ్యాణ్ ల కూతురు చాలా ముద్దుగా ఉంది. ముఖ్యంగా తండ్రి పోలికలే వచ్చాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పిల్లల కోసమైనా వీళ్ళు కలిసి ఉండాలని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై ఈ జంట ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×