Today Gold Price: గోల్డ్ కొనుగోలు చేసేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నిన్న, మొన్నటి వరకు భారీగా పెరిగి కొండెక్కి కూర్చున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా అలర్ట్‌గా ఉంటున్నారు. ఈ కారణంగా సూచీలు షేక్ అవుతున్నాయి. అయితే, ప్రధాన షేర్లలో మదుపర్లు ఏకపక్షంగా అమ్మకాలకు దిగడంతో సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. మామూలు నష్టాలు కాదు. ఒక్కరోజులో 9 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యేంతగా సీన్ మారిపోయింది.
ఓవరాల్‌గా గత ఐదు రోజుల్లో ఇన్వెస్టర్లు 18 లక్షల కోట్లు కోల్పోయారు. BSE లిస్టెడ్ కంపెనీల వాల్యూ 426 లక్షల కోట్ల నుంచి 408 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లలోనూ కూడా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలోనే గోల్డ్ రేట్స్ తగ్గాయని ఎనలిస్ట్‌లు అంటున్నారు. తాజాగా గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. ఏకంగా 700 తగ్గి రూ.79,400కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.710 తగ్గి, రూ. 86,670 కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,400 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 86,670 వద్ద కొనసాగుతోంది.
విజయవాడ, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,670 పలుకుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,400 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,670 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,550 రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,820 పలుకుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,670 చేరుకుంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,400 కి చేరగా.. పది గ్రాముల బంగారం ధర రూ.86,670కి చేరుకుంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,400 వద్ద ట్రేడింగ్ లో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,670 ధర పలుకుతోంది.
కోల్‌కతా, కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86,670 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: పార్లమెంటులో కొత్త ఇన్‌కమ్ టాక్స్ బిల్లు.. వచ్చే వారం ప్రవేశపెట్టనున్న సీతారామన్
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,07,000 ఉంది.
ఢిల్లీ, కోల్ కతా, ముంబై, బెంగళూరులో కిలో వెండి ధర రూ.95,500 వద్ద కొనసాగుతోంది.