Dil Raju : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా రాణించాలి అంటే కాస్త అదృష్టం కూడా ఉండాలని అంటున్నారు సినీ పెద్దలు. అలాంటి వారైతేనే ఎలాంటి ఒడిదడుగులు ఎదురైనా కూడా ఇండస్ట్రీలో నిలబడతారు. అలా తెలుగులో ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. అయితే దిల్ రాజు ఇండస్ట్రీలోకి రావడానికి ఓ వ్యక్తి కారణమంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తుంది. ఆయన వల్లే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడట దిల్ రాజు. ఇంతకీ ఆయన ఎవరు? ఏం చేస్తుంటారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని అందుకున్న సెలబ్రిటీలు అందరూ ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. దిల్ రాజు కూడా ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడట.. ఆయన అసలు పేరు వెంకట రమనా రెడ్డి.. మొదట్లో దిల్ రాజు డబ్బింగ్ మూవీస్ తీసి అవి అట్టర్ ఫ్లాప్ అవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో ఆయనకు సహకారం అందించి ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడేలా చేసింది మాత్రం ఓ వ్యక్తి. ఆయన ఎవరో కాదు. కాస్ట్యూమ్ కృష్ణ.. ఆయన నటుడిగా మరియు నిర్మాతగా, చాలా పాపులర్ అయ్యారు.. భారత్ బంద్ సినిమాతో మొదటి సారి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయనని అందించిన చిత్రాల్లో జగపతిబాబు రాసి జంటగా నటించిన పెళ్లి పందిరి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఆ సమయంలో వరుస ప్లాపులతో సతమతమవుతున్న దిల్ రాజును పిలిచి మరి కేవలం 60 లక్షల కే పెళ్లి పందిరి సినిమా నైజాం హక్కులను ఇచ్చారట. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఇక ఈ మూవీతో దిల్ రాజ్ కెరియర్ మారిపోయింది. అప్పటి నుంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ వచ్చారు. అటు కృష్ణ కూడా వరుసగా హిట్ సినిమాలను నిర్మిస్తూ బాగా బిజీ అయ్యారు. అయితే ఓ సందర్భంలో ఆయన చేత తెల్ల పేపర్లపై సంతకం పెట్టించుకుని మోసం చేయడంతో ఆయన ఆస్తులు కోల్పోయి ఆ తర్వాత సినిమాలకే దూరమైపోయారు. ప్రస్తుతం దిల్ రాజు మాత్రం భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల ఏడాదికి రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతి వస్తున్న మూవీలను నిర్మించారు. ఆ సినిమాలు మంచి కలెక్షన్స్ ని అందుకున్నాయి.. ఇక ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ్లో కూడా కొన్ని సినిమాలను నిర్మిస్తున్నారు దిల్ రాజు.. త్వరలోనే ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.