BigTV English

MLC K Kavitha on BC Reservation: కవితకు అన్న ఝలక్.. బీసీల కోసం ఏకాకి పోరాటం

MLC K Kavitha on BC Reservation: కవితకు అన్న ఝలక్.. బీసీల కోసం ఏకాకి పోరాటం

ప్రభుత్వం నిర్వహించిన కులగణనతో బీసీల్లో కాంగ్రెస్‌ పార్టీ మైలేజ్‌ వస్తుందని ఎమ్మెల్సీ కవిత ముందుగానే గ్రహించినట్లు ఉన్నారు. అందుకే కులగణనపై బీఆర్ఎస్‌ నుంచి ఎవరూ నోరు విప్పక ముందు నుంచే కవిత దానిపై స్పందిస్తున్నారు. కవిత యాక్షన్‌ ప్లాన్‌తో బీసీ ఓటు బ్యాంకు ఎక్కడ తనకు దూరమవుతుందో అన్న అనుమానంతో హడావిడిగా బీసీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్గంజ ఇప్పటికే బీసీ ఇష్యూతో ఎమ్మెల్సీ కవిత చాంపియన్‌గా అవతరించారని, సొంత పార్టీలోనే ఆమె పవర్ సెంటర్‌గా మారుతుండటం కేటీఆర్ వర్గానికి మింగుడు పడడంలేదని ఇంటర్నల్ టాక్. ఆ క్రమంలో ఆమెను ఒంటరిని చేయడానికి బీసీ అంశాన్ని ఎత్తుకుని ఆమెకు ఎజెండా లేకుండా చేయాలని కేటీఆర్ అండ్ కో భావిస్తున్నారంట.

ఈ ఇష్యూతో అటు సీఎం రేవంత్‌ రెడ్డిని, ఇటు ఎమ్మెల్సీ కవితను ఎదుర్కోవచ్చని, ఇంకోవైపు బీసీల ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చని కేటీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇంతకాలం బీసీ సంఘాలను పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు కులగణన అంశాన్ని టేకప్ చేసి తప్పులతడక అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది. త్వరలో జిల్లాల స్థాయిలో బీసీ సభలను నిర్వహించాలని భావిస్తోంది. ఫూలే యునైటెడ్ ఫ్రంట్ పేరుతో గతేడాది జనవరి 30న ఒక సంస్థను ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏడాది కాలంలో దాదాపు 80 బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కులాలవారీగా కూడా సంఘాల నేతలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్కు దగ్గర నిర్వహించిన సభకు వివిధ కుల సంఘాల నుంచి మద్దతు లభించింది.


పార్టీకంటే ముందే ఇష్యూను టేకప్ చేసిన కవిత ఈ అంశంలో పవర్ సెంటర్‌గా మారుతున్నారని కేటీఆర్ అనుమానిస్తున్నారంట. అందుకే ఆ అంశాన్ని టేకప్ చేసి కవితకు మాట్లాడే అవకాశం లేకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంట. బీసీ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ నిర్వహిస్తున్న సమావేశాలకు ఆమెను ఆహ్వానించలేదు. త్వరలో బీసీ అంశంలో పార్టీ చేపట్టనున్న యాక్టివిటీని, జిల్లాల స్థాయిలో సభల నిర్వహణపై కేటీఆర్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారట.

Also Read: బీజేపీతో కేసీఆర్ డీల్..? ఆ నేతలు బలి..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆమెను పార్టీ యాక్టివిటీస్‌లో అంతగా ఇన్వాల్‌ కానీయడం లేదని పార్టీలోని ఓ వర్గం చెబుతున్న మాట. పార్టీ సమావేశాలకు సైతం ఆమెను ఆహ్వానించడంలేదంట. ఒకవేళ పిలిచినా వేదికపై మాట్లాడేందుకు చాన్స్ ఇవ్వడంలేదంటున్నారు. కేటీఆర్ వ్యూహంలో భాగంగానే కులగణన విషయమై శాసనమండలిలో మాట్లాడేందుకు మధుసూదనాచారి, ఎల్ రమణ, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారంట.

అయితే బీసీ ఇష్యూలో పార్టీకంటే ముందుగానే కవిత చొరవ తీసుకుని డెడికేటెడ్ కమిషన్‌కు 33 పేజీల నోట్ ఇచ్చారని, సమస్యలను ప్రస్తావించారని ఆమె సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు కనీసం సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ సమావేశం అవుతుండటం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

AP Politics: గుంతకల్లు టీడీపీలో కుర్చీలాట..

TDP Politics: యనమలను పక్కన పెట్టేశారా? అసలేం జరిగింది..!

Putin, Trump Deals: యూరప్ చీలబోతుందా.? ట్రంప్ , పుతిన్ చర్చలో ఇది జరిగితే మనకి జరిగే లాభం ఇదే.!

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Big Stories

×