Today Gold Rate: ఈరోజు(ఏప్రిల్ 15) పసిడి లేదా వెండి కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు కాస్త బ్రేక్ పడింది. తాజాగా 22 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.350 తగ్గి, రూ. 87,200 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.330 తగ్గి, రూ. 95,180 కి చేరుకుంది.
కాగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్‌లకు విరామం ప్రకటించడం, అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం, ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించడం వంటి అంశాలు దేశీయ మార్కెట్లకు అనుకూలంగా మారాయి. దీంతో ఇవాళ మార్కెట్ ఓపెన్ కావడమే లాంగ్ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయ్యాయి. సెన్సెక్స్ 1500 పాయింట్ల, నిఫ్టీ 440 పాయింట్ల లాభంతో ట్రేడ్ ప్రారంభించాయి. ఇక డాలర్‌తో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.84గా ఉంది.
బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ షేర్లు కూడా లాభాల్లోనే ఉన్నారు. HUL, నెస్లే షేర్లు నష్టాల్లో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పసడి ధరలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. ఇవాళ బంగారం ధరలు కూడా తగ్గాయి. గత వారం వరుసగా పెరిగిన బంగారం ధరలు సోమవారం తగ్గాయి. నిన్నటి బాటలోనే ఇవాళ కూడా తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,200 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,180 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,200 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,180 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,200 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,180 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,350ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 330 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,200 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,180 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,200 వద్ద ట్రేండింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,180 పలుకుతోంది
కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,200 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,180 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,200 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95,180 వద్ద కొనసాగుతోంది.
Also Read: ఇండియాలో మరోచోట ఐఫోన్ల తయారీ..స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు
వెండి ధరలు ఇలా..
ఈరోజు వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖంపట్టాయి. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,09,800 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,800 వద్ద కొనసాగుతోంది.