BigTV English

India’s Luxury Trains: ఇండియాలో టాప్ 5 లగ్జరీ రైళ్లు ఇవే, ఒక్కసారైనా జర్నీ చేయాల్సిందే!

India’s Luxury Trains: ఇండియాలో టాప్ 5 లగ్జరీ రైళ్లు ఇవే, ఒక్కసారైనా జర్నీ చేయాల్సిందే!

Indian Railways: భారతీయ రైల్వేను దేశ జీవనాడిగా పిలుస్తారు. రోజూ 13 వేల రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. లక్షలాది మంది ప్రయాణీకులు వీటి ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇక దేశంలో కొన్ని లగ్జరీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. సుదూర ప్రయాణం మరింత సౌకర్యంగా మార్చుతున్నాయి. విలాసవంతమైన ఈ రైళ్లలో ప్రయాణ ఖర్చు ఎక్కువే అయినప్పటికీ, రాయల్ జర్నీ చేయాలనుకునే వాళ్లు వీటిని ఎంచుకుంటున్నారు. రెస్టారెంట్లు, బార్లతో పాటు లగ్జరీ బెడ్ లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు ప్రయాణాన్ని అద్భుతంగా మార్చుతాయి. దేశంలోని టాప్ 5 లగ్జరీ రైళ్లు ఏవి? అవి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


దేశంలోని టాప్ 5 లగ్జరీ రైళ్లు

⦿ దక్కన్ ఒడిస్సీ


దక్కన్ ఒడిస్సీ రైలును తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహిస్తోంది. 16వ శతాబ్దంలో మహారాజుల జీవితాలకు అద్దం పట్టేలా దీన్ని రూపొందించారు. మహారాష్ట్ర పర్యాటకశాఖ చొరవతో దక్కన్ ఒడిస్సీ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు ప్రయాణీకులకు అత్యంత లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తుంది. ముంబై- ఢిల్లీ నడుమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

⦿ మహారాజాస్ ఎక్స్‌ ప్రెస్

భారతదేశ రాచరిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం మహారాజాస్ ఎక్స్‌ ప్రెస్. ఇది ప్రెసిడెన్షియల్ సూట్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రైవేట్ లాంజ్‌ లు, బెడ్‌ రూమ్‌ లు, విలాసవంతమైన వాష్‌ రూమ్‌ లు, ఖరీదైన డైనింగ్ ఏరియా ఉంటుంది.   ప్రీమియం ఫైవ్ స్టార్ హోటల్‌ ను తలదన్నేలా ఉంటుంది. ఈ రైలు ఢిల్లీ నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టి త్రివేండ్రం వరకు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

⦿ రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్

రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ రాజస్థాన్ గొప్ప సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా ఉంటుంది. రాజస్థాన్ రాయల్ ప్యాలెస్‌ల శైలిలో అలంకరించబడి ఉంటుంది. అద్భుతమైన ఇంటీరియర్స్ తో పాటు అద్భుతంగా రూపొందించారు. ఈ రైలులో రెండు రెస్టారెంట్ కోచ్‌ లు, సావనీర్ కోచ్,  స్పోర్ట్, స్పా కోచ్ ఉంటాయి. ఇతర రైళ్ల మాదిరిగానే, ఈ రైల్వే కోచ్ రాయల్ అనుభూతిని అందిస్తుంది. ఇది ఢిల్లీ- రాజస్థాన్ మధ్య రాకపోకలు కొనసాగిస్తుంది.

⦿ ప్యాలెస్ ఆన్ వీల్స్

ఈ రైలును కూడా రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నడిపిస్తుంది. ఈ లగ్జరీ రైలు భారతీయులతో పాటు  విదేశీ సందర్శకుల కోసం ప్రవేశపెట్టారు. ఈ ప్రీమియం రైలు తన రాజరిక వైభవాన్ని చాటుకుంటుంది. ఈ రైలు జైపూర్ నుంచి ప్రారంభమైన ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్తుంది.

Read Also: రైళ్లలో రింగ్ మార్పిడి పద్దతి గురించి తెలుసా? ఒకప్పుడు ఇది చాలా ఫేమస్!

⦿ ది రాయల్ ఓరియంట్

రాయల్ ఓరియంట్ ఢిల్లీ, ఉదయపూర్, అహ్మదాబాద్, జైపూర్, జునాగఢ్, పాలిటానాతో సహా గుజరాత్, రాజస్థాన్ లాంటి ముఖ్యమైన డెస్టినేషన్స్ ను కవర్ చేస్తుంది. ఈ రైలు ఢిల్లీలో ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి ప్రతి బుధవారం ప్రయాణాన్ని మొదలుపెడుతుంది.

Read Also: డ్రైవర్ లేకుండా 70 కి.మీ ప్రయాణించిన గూడ్స్ రైలు, చివరకు ఏం జరిగిందంటే?

Related News

Vande Bharat Trains: హైదరాబాద్ కు 2 కొత్త వందే భారత్ రైళ్లు.. శతాబ్ది ఎక్స్‌ ప్రెస్ స్థానంలో రీ ప్లేస్!

Water on Coal: రైల్వే వ్యాగన్లలో బొగ్గు తరలించేటప్పుడు నీళ్లు చల్లుతారు, ఎందుకో తెలుసా?

Moscow – Indian Tourists: భారత పర్యాటకులకు మాస్కో సాదర స్వాగతం, కారణం ఏంటో తెలుసా?

Benefits of Train Ticket: రైల్వే టికెట్ తో ఇన్ని ఫ్రీ సదుపాయాలా? అస్సలు ఊహించి ఉండరు!

Vande Bharat: వందేభారత్ లో తాగి రచ్చ చేసిన జంట, RPF సిబ్బంది ఏం చేశారంటే?

Goa history: ఏంటీ.. గోవాలో ఉన్నది రెండే జిల్లాలా? వీటిలో ఏది బెస్ట్?

Tourist Footfall: ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ఇండియన్ స్టేట్ ఇదే, వామ్మో.. ఏడాదిలో అంత మందా?

Islands In India: స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవులు, ఎక్కడో కాదు.. ఇండియాలోనే!

Big Stories

×