Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర భారీగా తగ్గాయి. ఏకంగా తులం బంగారానికి రూ.3000 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారానికి రూ.2,750 తగ్గి.. రూ.90,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.3000 తగ్గి, రూ. 98,350 వద్ద కొనసాగుతోంది.
చరిత్రలో ఎప్పుడూ లేనంతగా.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ నిన్న లక్ష మార్క్‌ను దాటేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగారం ధర దాదాపు రూ.20 వేల 800కు పైగా పెరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్‌గా పసిడి పరుగులుపెట్టిందో.. అయితే, ఈ పరుగు ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించట్లేదు. రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్షా 50 వేలకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, దీనికి ఎంత టైమ్ పడుతుందీ అనేది కచ్ఛితంగా చెప్పలేవు.
ఎందుకంటే, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు స్వల్పకాలంలో అస్థిరంగా మారుతూ ఉంటాయి. అలాగే, స్థిరంగా కూడా ఉంటాయి. అందుకే, ప్రస్తుతం బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఈ స్థాయిలలో షార్ట్ సెల్లింగ్‌ను నివారించాలని కూడా చాలా మంది నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం, ఇండియన్ రూపాయిలో బంగారానికి మద్దతు ధర రూ. 96 వేల 750 నుండి 96 వేల 200.. అలాగే, రెసిస్టేన్స్ రూ. 97 వేల 50 రూపాయల నుండి 97 వేల 690 వద్ద ఉంది. ఇంలాంటి పరిస్థితిలో.. పెరిగిన స్థాయిలలో పొజిషన్‌లను తేలికగా ఉంచుకోవాలనే సూచన ఉంది.
2025లో ఇప్పటివరకు బంగారం ధర 10 గ్రాములకు 26% పైగా పెరిగింది. ఈ ర్యాలీకి బలమైన ప్రతికూలతలు ఉన్నప్పటికీ, జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. ప్రపంచ పరిస్థితులను.. ముఖ్యంగా డాలర్ ఇండెక్స్, అమెరికా-చైనా పరిణామాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బంగారం ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,150 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 350 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,150 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 350 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 350 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,300ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 500 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96, 320 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96,320 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: ఇండియాలో బంగారం ధరలు ఎక్కడ తక్కువ? ప్రపంచంలో ఎక్కడ చీప్ గా దొరుకుతుంది?
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు మాత్రె స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,11,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,01,000 వద్ద కొనసాగుతోంది.