BigTV English

Karthik Subbaraj : పిజ్జా సినిమా ఇప్పుడు వస్తే, హిట్ అవుతుందో లేదో చెప్పలేం

Karthik Subbaraj : పిజ్జా సినిమా ఇప్పుడు వస్తే, హిట్ అవుతుందో లేదో చెప్పలేం

Karthik Subbaraj : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో కార్తీక్ సుబ్బరాజు ఒకరు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు కొత్త బ్రిలియంట్ గా ఉంటాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సినిమా ప్రేమికులకు కార్తీ రోజు ఒక ఫేవరెట్ డైరెక్టర్. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ నెక్స్ట్ అనిపిస్తుంది. కార్తీక్ సుబ్బరాజు సినిమా చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. స్వతహాగా రజనీకాంత్ అభిమాని కావడంతో పెట్ట సినిమాను ఎంత అద్భుతంగా డీల్ చేశాడో అందరికీ తెలిసిన విషయమే. రజినీకాంత్ అభిమానులు సూపర్ స్టార్ ని ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇకపోతే కార్తీక్ సూపర్ ప్రాజెక్ట్ ప్రతి సినిమా కూడా టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం సూర్య హీరోగా రెట్రో అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు సినిమాలు మాదిరిగానే ఇది ఒక గ్యాంగ్ స్టార్ సినిమా అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇది ఒక ప్రొపెర్ లవ్ స్టోరీ అని చెప్పుకొచ్చాడు.


ఇప్పట్లో పిజ్జా డౌటు

ఇక కార్తీక్ సుబ్బరాజు మొదటి సినిమాతోనే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. తను తీసిన మొదటి సినిమా పిజ్జా చాలామందికి సర్ప్రైజింగ్ అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ట్విస్ట్ చూసి చాలా మందికి మతి పోయిందని చెప్పాలి. ఇప్పటికీ చూసినా కూడా ఆ సినిమా అదే ఫీల్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కార్తీక్. తన సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న తరుణంలో అనేక ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గా ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పిజ్జా సినిమా ఇప్పుడు విడుదల అయితే సక్సెస్ అవుతుంది అనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆలోచించే విధానం కంప్లీట్ గా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్.


కంప్లీట్ అప్డేట్

కాలంతోపాటు దర్శకులు కూడా మారుతూ ఉండాలి. ఎందుకంటే కరోనా తర్వాత చాలా సినిమాలు చూసే విధానం ఆడియన్ మైండ్ సెట్ లో మారిపోయింది. ఎందుకంటే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకొని మొత్తం వరల్డ్ సినిమాని అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు ఏ సినిమా చూసినా కూడా ఈ సినిమాని ఎక్కడి నుంచి కాపీ కొట్టారో చెప్పేసే అంత తెలివైన వాళ్ళు ప్రేక్షకులు. ఇదే విషయాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూ లో కూడా చెబుతూ వస్తాడు. ఇప్పుడు ఇక్కడ మన కథను మాత్రమే చెప్పాలి అంటూ అక్కడ నుంచి తన శైలి కూడా మార్చుకున్నాడు త్రివిక్రమ్. ఇక కార్తీక్ సుబ్బరాజు విషయానికి వస్తే తను కూడా అదే స్థాయిలో అప్డేట్ అవుతున్నాడు. ముఖ్యంగా ఒకవేళ పిజ్జా సినిమా ఇప్పుడు రిలీజ్ చేయాల్సి వస్తే ఆ స్క్రిప్ట్ లో కూడా ఆడియన్స్ సప్రైజ్ అయ్యేలా ఎలిమెంట్స్ ను పెట్టగలడు.

Also Read : Tejeswi Madivada: ఆ హీరోతో నా పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన బిగ్ బాస్ బ్యూటీ..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×