Today Gold Rate: మన దేశంలో అక్షయ తృతీయ సందర్బంగా.. బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆరోజున బంగారం కొంటే శుభప్రదమని చాలా మంది చెబుతుంటారు. ఏప్రిల్ 30న జరుపుకోనున్న అక్షయ తృతీయ.. నూతన పెట్టుబడులకు అనువైన సమయం. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పరిశీలిస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,050కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,240 వద్ద కొనసాగుతోంది.
అయితే గత కొద్ది రోజుల క్రితం లక్ష మార్క్‌ను క్రాస్ చేసిన గోల్డ్ రేట్స్.. రిచ్ పీపుల్‌కి కూడా పిచ్చిక్కిపోయేలా బంగారం ధర బరువెక్కింది. గోల్డ్ పేరు వింటేనే కొనుగోలుదారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా.. ఆల్ టైమ్ హైలో బంగారం కొండెక్కి కూర్చుంది. రికార్డ్ స్థాయిలో ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలకు ట్రంప్ టారీఫ్‌లతో కొత్త రెక్కలు పొడుచుకొచ్చాయి. పది గ్రాముల బంగారం ధర లక్ష దాకా చేరుకుంటుందనే అనుమానం కాస్తా ఇప్పుడు నిజమయ్యింది.
కాగా.. బుధవారం నాడు రూ.3000 తగ్గింది. మళ్లీ ఈరోజు(ఏప్రిల్24)న బంగారం ధరకు రూ.100 తగ్గింది. దీంతో పసిడి కొనుగోలు చేసేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గోల్డ్ కొనేందుకు ఇదే మంచి ఛాన్స్ అంటున్నారు నిపుణులు.. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు వంటి చాల అంశాల ద్వారా బంగారం ధరల్లో మార్పులు సహజమే అయినప్పటికీ.. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రంప్ టారీఫ్ వార్‌తో పసిడి ధర మరింత పెరుగుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,050 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 240 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,050 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 240 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 240 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,200ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 340 కి చేరుకుంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,050 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 240 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 240వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి..రూ. 12,000 కోట్ల ఆదాయంపై ప్రభావం చూపనుందా..
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు మాత్రె స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,10,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,900 వద్ద కొనసాగుతోంది.