Rashmi Guatham : బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లగా మారారు.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. కొందరేమో ఏకంగా సినిమాలను నిర్మిస్తుంటే.. మరి కొందరేమో సినిమాల కు దర్శకత్వం వహిస్తూ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ షో కామెడికి కేరాఫ్ గా ఉండేది. ఈ మధ్య బూతులకు అడ్డాగా మారిందనే వాదన సోషల్ మీడియా లో వినిపిస్తుంది. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమో లో యాంకర్ రష్మీ రెచ్చిపోయినట్లు కనిపిస్తుంది. కమెడియన్ పై రష్మిక దారుణమైన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అదే ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది..
జబర్దస్త్ షోలో యాంకర్ గా రష్మీ..
యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా మాత్రం యాంకర్ గా విశేష స్పందనను సొంతం చేసుకుంది. యాంకర్ గా తనదైన శైలిని చూపిస్తూ ఆడియెన్స్ ను మెప్పించింది. తక్కువ సమయంలోనే యాంకర్ గా మంచి క్రేజ్ దక్కించుకుంది. బుల్లితెర పై ఈ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. రష్మీ గౌతమ్ ప్రస్తుతం జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. మరోవైపు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ మెరుస్తోంది. అయితే రష్మీ తన పై ఎవరు కామెంట్స్ చేసిన అస్సలు ఊరుకోదు. రివర్స్ పంచ్ వేస్తుంది.
Also Read : పెళ్ళైన తర్వాత భర్త హత్యకు గురైతే.. భార్యకు తెలిసిన భయంకరమైన నిజాలు.. మస్ట్ వాచ్..
జబర్దస్త్ లో కమెడీయన్ పై రష్మీ ఫైర్..
రష్మీ గౌతమ్ ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. తనని ఎవరైనా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్లకి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇస్తుంది. అలాంటి లక్ష్మి తాజాగా జబర్దస్త్ షోలో కమెడియన్ పై విరుచుకుపడింది. తాజాగా షో ప్రోమో ను రిలీజ్ చేశారు. రష్మీ గౌతమ్ పై కెవ్వు కార్తీక్ ఫన్నీ కామెంట్లు వేశాడు. వృద్ధురాలి గెటప్ వేదికపై నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్ కూడా ముసలిదేనని, పెళ్లి కాకుండానే ఉండిపోతుందంటూ డైలాగ్ చెబుతాడు.. ఆ మాట వినగానే కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా రెస్పాండ్ అయ్యి చెప్పు తెగిపోతుంది అంటూ ఫైర్ అవుతుంది. దీంతో వెంటనే కమెడియన్ కెవ్వు కార్తీక్ తన మాట మార్చుకుంటాడు. ఇక రష్మీ గౌతమ్ రీసెంట్ గానే తన 37వ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంది.. రష్మీ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకు హోస్ట్ గా వ్యవహారిస్తుంది.. సినిమాలు, షోలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో, తన వీడియోలతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఆమె పెట్టిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి..