Today Gold Rate: ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నాయంటే.. గోల్డ్ రేటు ఎంత ఉన్నా బంగారం కొనాల్సిందే.. గత వారం రోజుల నుంచి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారంతో పోలిస్తే.. ఈరోజు(డిసెంబర్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరకు రూ.150 పెరిగి.. రూ.71,500 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.160 పెరిగి, రూ.78,000కి చేరుకుంది. ప్రస్తుతం పట్టణ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
బంగారం ధరలు ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,650 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,150 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500 పలుకుతుంది.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
గుంటూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరు విషయానికి వస్తే..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500 ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000కి చేరుకుంది.
కేరళ, కోల్‌కత్తాలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 వద్ద కొనసాగుతోంది.
Also Read: వార్షిక ఆదాయం రూ.15 లక్షలు ఉంటే ఇన్‌కం ట్యాక్స్ తగ్గింపు.. కేంద్రం ప్లాన్
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాత్రం భారీగా పెరుగుతుంటే.. వెండి ధరలు కాస్త దిగొస్తున్నాయి. ఈరోజు కిలో వెండికి రూ.10 చొప్పున తగ్గింది. చెన్నై, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.99,900 ఉంది.
ముంబై, ఢిల్లీ, పుణె, కోల్ కత్తాలో 92,400 వద్ద కొనసాగుతోంది.