BigTV English

IND vs Aus 4th Test: బాక్సింగ్ టెస్టులో టీమిండియా ఘోర ఓటమి.. WTC ఆశలు లేనట్టే ?

IND vs Aus 4th Test: బాక్సింగ్ టెస్టులో టీమిండియా ఘోర ఓటమి.. WTC ఆశలు లేనట్టే ?

IND vs Aus 4th Test: బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ టెస్ట్ లో భారత్ ఓటమిపాలైంది. రెండవ ఇన్నింగ్స్ లో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 155 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. భారత బ్యాటింగ్ లో యశస్వి జైష్వాల్ (84), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (30) పరుగులతో రాణించారు.


Also Read: Happy Retirement: ఇక మీ సేవలు చాలు.. అశ్విన్‌ లాగా రిటైర్మెంట్‌ ఇవ్వండి..!

మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి హీరోగా మారిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి రెండవ ఇన్నింగ్స్ లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవీలియన్ చేరాడు. నాలుగోవ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 184 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత టాప్ బ్యాటర్లు అంతా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమీన్స్ 3, స్కాట్ బోలాండ్ 3, స్టార్క్, హెడ్, లియాన్ తలో వికెట్ పడగొట్టారు.


ఈ విజయంతో ఆస్ట్రేలియా 2-1 లీడ్ లో ఉంది. మొదటి టెస్టులో భారత జట్టు విజయం సాధించగా.. రెండవ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక మూడవ టెస్ట్ వర్షం కారణంగా డ్రా గా ముగిసింది. నాలుగోవ టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో 2- 1 ఆస్ట్రేలియా ఆదిక్యంలో కొనసాగుతోంది. ఐదో రోజు పూర్తి బ్యాటింగ్ చేయలేక భారత జట్టు చతికిల పడింది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో జట్టు ఓటమి చెందిందని అభిమానులు ఫైర్ అవుతున్నారు.

300 ప్లస్ చేజింగ్ లో భారత జట్టు ఓటమిని ఎదుర్కోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది 49వ సారి కావడం విశేషం. ఈ ఓటమితో భారత జట్టు డబ్ల్యుటిసి ఫైనల్ కి వెళ్లే అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నాలుగో టెస్ట్ డ్రా గా ముగిస్తే తదుపరి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఆస్ట్రేలియా జట్టు టీమ్ ఇండియా ని దారుణంగా దెబ్బతీసింది. ఆసీస్ బౌలర్ల దాటికి భారత టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. నేడు తొలి సెషన్ లోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. టీ బ్రేక్ వరకు కుదురుగా ఆడింది.

కాస్త ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకున్న రోహిత్ శర్మ 17 ఓవర్ తొలి బంతికే 9 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్ అదే ఓవర్ లో చివరి బంతికి డకౌట్ గా వెనుదిగాడు. ఇక కేవలం నాలుగు ఓవర్ల వ్యవధిలోనే రిషబ్ పంత్, జడేజా వికెట్లను కోల్పోయింది భారత జట్టు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన సెంచరీ హీరో నితీష్ కూడా డకౌట్ అయ్యాడు.

Also Read: MS Dhoni: మెల్‌ బోర్న్‌ తో ధోనికి ఉన్న బంధం ఇదే.. సరిగ్గా 10 ఏళ్లు !

క్రీజులో కుదురుకున్న యశస్వి జైష్వాల్.. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఆచితూచి ఆడుతూ ముందుకు సాగాడు. కానీ అతడు వివాదాస్పద రీతిలో అవుట్ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆస్ట్రేలియా డీఆర్ఎస్ కోరగా.. రిప్లై లో బాల్ బ్యాట్ ని తాకనట్లుగా కనిపించింది. దాంతో పదే పదే పరిశీలించిన థర్డ్ ఎంపైర్ చివరకు అవుట్ గా ప్రకటించారు. ఇక జైస్వాల్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ ఓటమితో భారత్ డబ్ల్యుటిసి ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×