Today Gold Rate: భారత్‌లో పసిడి ధరలు ఆగడం లేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. మళ్లీ యథావిధిగా బంగారం ధరలు తగ్గేదేలే అనేలా దూసుకుపోతున్నాయి. ఇక పెళ్లిల్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజుకో రికార్డుతో ఆల్ టైమ్ హైలో కొనసాగుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్స్ పెరగడంతో పండుగలు, వివాహాల వంటి శుభకార్యాలకు బంగారం కొనాలంటే.. ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
రాబోయే రోజుల్లో పసిడి మూడు వేల డాలర్లు దాటే అవకాశం కనిపిస్తుంది. ఒక వేళ ఇదే జరిగితే మాత్రం, దేశవ్యాప్తంగా బంగారం ధరలు లక్ష దాటడం ఖాయమేనని నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరలు(Gold Rate) చూస్తే.. 22 క్యారెట్ల బంగారానికి ఏకంగా రూ.650 పెరిగి, రూ.80,350కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం ధరకూ రూ.700 పెరిగి, 87,650 కి వద్ద ట్రేడింగ్ అవుతోంది. పట్టణ నగరాల్లో గోల్డ్ ఎలా ఉన్నాయంటే..
గోల్డ్ రేట్స్ ఇలా..
హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.80,350 కి చేరుకోగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,650 పలుకుతోంది. గ్రాము రూ.8,765 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,650 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,350 చేరుకోగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,650 వద్ద ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,450 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,800 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,350 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,650 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,650 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,350 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,650 ఉంది.
కోల్ కత్తా, కేరళ, ఇతర నగరాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,650 వద్ద కొనసాగుతోంది.
Also Read: ఆదాయపు పన్ను సేవింగ్స్ కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
వెండి ధరలు ఇలా..
వెండి ధరలను విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,08,800 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ, కోల్ కత్తా, బెంగళూరు, పుణె ఇతర నగరాల్లో 1,00,500 ఉంది.