Abhimanyu Singh:అభిమన్యు సింగ్ (Abhimanyu Singh).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన గబ్బర్ సింగ్ (Gabbarsingh) సినిమాలో ‘సిద్ధప్ప నాయుడు’గా అభిమన్యు సింగ్ తన నటనతో విలనిజంతో భయపెట్టాడు. ఇక భయపెడుతూనే నవ్వకుండానే నవ్వించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అలా ఆయనకు తెలుగులో భారీగా అవకాశాలు లభించాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ‘రక్త చరిత్ర’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సిద్ధప్ప నాయుడు ఇందులో బుక్కా రెడ్డిగా నటించి అందరిని ఆశ్చర్యపరిచారు. రక్త చరిత్రలో బుగ్గారెడ్డి పాత్రను భయంకరంగా పండించి, ఉత్తమ విలన్ అని నిరూపించుకున్న ఈయన.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన రెమ్యూనరేషన్ తో పాటు పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
రూ.40 వేలు కాస్త రూ.40 లక్షలు అయింది..
అభిమన్యు సింగ్ మాట్లాడుతూ.. “నేను నటించిన మొదటి సినిమా అక్స్ కోసం తీసుకున్న పారితోషకం కేవలం 12 సంవత్సరాల మాత్రమే. చాలా సంవత్సరాల పాటు ఒక సినిమాకు రూ.20వేల లోపే పారితోషకం ఇచ్చేవారు. కానీ రక్త చరిత్ర సినిమాకు రూ.40,000 ఇవ్వడం జరిగింది. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది . ఈ సినిమాలో నటించాను కాబట్టే నాకు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో అవకాశం లభించింది. నేను డబ్బును నమ్ముకోలేదు. అందువల్లే వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటూ ముందడుగు వేశాను. అందుకే డబ్బు గురించి ఆలోచించలేదు కాబట్టే రక్త చరిత్రలో నా నటన చూసి గబ్బర్ సింగ్ లో అవకాశం ఇవ్వడమే కాకుండా ఏకంగా రూ.40 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారు. దీంతో నా లైఫ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అలా 2010లో తొలిసారి ఎక్కిన కార్వాన్ 2025 వచ్చినా సరే దిగలేదు. ఆ రెండు సినిమాలు నా జీవితంలో అంత ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ లో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు” అంటూ అభిమన్యు సింగ్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
ఫ్లోర్ ఊడ్వడంతోనే కెరీర్ మొదలు..
అభిమన్యు సింగ్ కెరియర్ విషయానికి వస్తే.. ఈయన స్వస్థలం బీహార్ రాజధాని పాట్నా. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎన్నో కలలతో ముంబైకి చేరుకున్నాడు. నిర్మాతల చుట్టూ తిరుగుతూ చెప్పులు అరిగేలా వారి వెంటపడ్డారు. కానీ ఫలితం శూన్యం. థియేటర్ రోడ్డు నుంచి వెళ్తే ప్రయాణం కాస్త సులువు అవుతుంది అనుకొని.. మకరంధ్ దేశ్పాండే థియేటర్ గ్రూప్ ‘అంశ్’ లో చేరాడు. ఇక్కడ నటన గురించి కాకుండా చీపురు తీసుకొని ఫ్లోర్ ఊడ్వమని చెప్పాడట. నేను వచ్చింది నటన నేర్చుకోవడానికి ఊడ్వడానికి కాదు అని కోపంతో రగిలిపోయాడట. అయినా మకరంద్ పట్టించుకోలేదు. ఆ తర్వాత తన కోపం పై నీళ్లు చల్లుకొని.. చెప్పిన పని చేసుకుంటూ థియేటర్లలో ఫ్లోర్ ఊడుస్తూ కెరియర్ను సాగించాడట. పట్టుదల ఉన్న అభిమన్యు సింగ్ ను చూసిన తర్వాత కొద్ది రోజులు అభిమన్యుకి నటనలో ఓనమాలు దిద్దించాడు మకరంధ్