Today Gold Rate: మన ఇండియాలో బంగారానికి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. వివిధ ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఇక ఏడాది బంగారం ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పసిడి లక్ష దాటుందని నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా పుత్తడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శివరాత్రివేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మంగళవారంతో పోలిస్తే.. నేడు(ఫిబ్రవరి 26)న బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. వరుస సెషన్స్ తర్వాత పండుగ వేళ బంగారం గోల్డ్ రేట్స్ తగ్గడం విశేషం.
ప్రధానంగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎక్కువ నష్టాలు రావడంతో దాని ప్రభావం ఓవరాల్‌గా మార్కెట్‌పై కనిపిస్తోంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మార్కెట్ దేశీయ మార్కెట్లపై ట్రంప్ ప్రభావం కనిపిస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే మార్కెట్లు ట్రేడ్ అయ్యాయి. కానీ.. టారిఫ్‌ల కీలక ప్రకటనలు చేసిన తర్వాతే భారీగా సూచీలు పడిపోతున్నాయి. ఈ 20 రోజుల్లోనే మార్కెట్ల ఎక్కువగా డౌన్ అయింది. దీని ప్రభావం గోల్డ్‌పై పడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారనికి రూ.250 తగ్గి, రూ.80,500కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 270 తగ్గడంతో.. రూ.87,820 వద్ద కొనసాగుతోంది. ఇక ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
పుత్తడి ధరలు ఇలా..
ఢిల్లీలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,970కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80, 650 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,820 పలుకుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80,500 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,820కి చేరుకుంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,820 పలుకుతోంది.
కేరళ, కోల్‌కత్తా ఇతర పట్టణ నగరాల్లో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,500 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,820 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,820 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,500 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,820 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,820 పలుకుతోంది.
Also Read: బాబోయ్.. ముఖేష్ అంబానీ ఇంట్లో పనివాళ్ల జీతం తెలిస్తే షాక్ తినాల్సిందే భయ్యా..
వెండి ధరలు పరిశీలిస్తే..
గోల్డ్ రేట్స్ మాదిరిగానే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. నేడు హైదరబాద్, వైజాగ్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,06,000కి చేరుకుంది.
బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.98,000 వద్ద కొనసాగుతోంది.