Today Gold Rate: కనీవినీ ఎరగని రీతిలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. వాస్తవానికి బంగారం, వెండికి చాలా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా నెలకొన్న మార్పులు కారణంగా పసిడి ధరల్లో నిత్యం మార్పలు చేర్పులు కనిపిస్తాయి. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరొకసారి పెరుగుతా ఉంటాయి. ప్రస్తుతం రూ.90,000 లకు చేరువలో ఉంది. 22 క్యారెట్ల తులం బంగారానికి రూ.550 పెరిగి, రూ.81,200కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారానికి రూ.600 పెరిగి, రూ.88,580 వద్ద కొనసాగుతోంది. ధరలు ఇలాగే కొనసాగితే త్వరలో రూ.లక్షకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.
పెళ్లిళ్లు, పండగల మొదలైన నేపథ్యంలో బంగారం కొనేందుకు కొనుగోలుదారులకు వెనకడుగు వేస్తున్నారు. దీనింతటికీ కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న వాణిజ్య విధానాలే అని అభిప్రాయం ఉంది. మెక్సికో, కెనడా, చైనాలపై భారీగా సుంకాలు విధించడం వంటి చర్యలు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడానికి దారి తీశాయని అంటున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్‌లో గరిష్ట స్థాయిలో అమెరికా షేర్ మార్కెట్ పతనం కాగా.. ఈ నాలుగు నెలల్లో దాన్ని మించిన స్థాయిలో పడిపోవడం చర్చనీయాంశమైంది.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
ఢిల్లీలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,730కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81, 350 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,200 పెరిగింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.88,580 కి చేరుకుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,200 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,580 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,200 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.88,580 పలుకుతోంది.
కేరళ, కోల్‌కత్తా ఇతర పట్టణ నగరాల్లో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,200 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.88,580 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,200 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.88,580 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,200 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.88,580 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,200 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.88,580 పలుకుతోంది.
Also Read: 1988లో రిలయన్స్ షేర్లను రూ.10తో కొన్నాడు..ఇప్పుడు వాటి విలువ తెలిసి షాక్!
వెండి ధరలు పరిశీలిస్తే..
గోల్డ్ రేట్స్ రోజు రోజుకి పరుగులు పెడుతున్న నేపథ్యంలో.. వెండి ధరలు కూడా తగ్గేదేలే అనేలా ఆకాశాన్నంటుతున్నాయి. నేడు హైదరబాద్, వైజాగ్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,10,000 కి చేరుకుంది.
బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.1,01,000 వద్ద కొనసాగుతోంది.