BigTV English

EPFO Update : 2024-25 ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు ఫైనల్ – మీకు కలిగే ప్రయోజనాలేటంటే?

EPFO Update : 2024-25 ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు ఫైనల్ – మీకు కలిగే ప్రయోజనాలేటంటే?

EPFO Update : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు 2024-25 ఆర్థిక ఏడాది (ఏప్రిల్-మార్చి)కి తన చందాదారులకు 8.25% వడ్డీ రేటును కొనసాగించాలని సిఫార్సు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న ఆర్థిక ఇబ్బందుల మధ్య వడ్డీ రేటు పెంపును EPFO ​​చందాదారులు ఆశించారు. కానీ.. వారి ఆశలకు భిన్నంగా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచేందుకు ట్రస్టీ మద్దతు తెలిపింది. EPFO అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT).. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


ట్రస్టీ బోర్డు సిఫార్సు ఆధారంగా భారత ప్రభుత్వం వడ్డీ రేటును అధికారికంగా ప్రకటించనుంది. ఆ తర్వాత EPFO ​​వడ్డీ రేటును చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది. శుక్రవారం జరిగిన EPFO ​​సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల 237వ సమావేశంలో.. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద బీమా ప్రయోజనాలను పెంచాలని కేంద్ర బోర్డు నిర్ణయించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

EDLI పథకం యాక్చురియల్ వాల్యుయేషన్ తర్వాత సభ్యుల కుటుంబానికి ఎక్కువ ఆర్థిక భద్రత, మద్దతును అందించడానికి బోర్డు పథకంలో కీలక మార్పులను ఆమోదించింది. ఇది ఈ వర్గం కింద ఉన్న ప్రధాన ఫిర్యాదులను పరిష్కరిస్తుంది, ప్రయోజనం పొందే హక్కుదారులకు మరింత సమగ్రమైన విధానాన్ని నిర్ధారిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం కింద.. EPF సభ్యుడు ఒక ఏడాదిలో వరుసగా జమ చేయకుండానే మరణిస్తే కనీసం రూ. 50,000 జీవిత బీమా ప్రయోజనం అందిస్తారు. ఈ సవరణ ప్రతీ ఏడాది 5,000 మందికి వర్తిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే.. కొత్త మార్పుల ప్రకారం, రెండు ఉద్యోగాల మధ్య రెండు నెలల వరకు ఖాళీగా ఉన్నా కానీ.. నిరంతరం జమ చేసినట్లుగా, సర్వీసులో ఉన్నట్లుగానే పరిగణించనున్నట్లు ట్రస్టీ వెల్లడించింది.


నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి ఈపీఎఫ్ డిపాజిట్లు
2021-22లో EPF డిపాజిట్ వడ్డీ రేట్లు నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1%కి తగ్గించారు. 2020-21 సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును CBT మార్చి 2021లో నిర్ణయించింది. ప్రస్తుత EPF డిపాజిట్ల వడ్డీ రేటు 2015-16 సంవత్సరానికి EPF డిపాజిట్ల రేటు కంటే గణనీయంగా తక్కువగా ఉంది. గతంలో ఈ వడ్డీ రేట్లు 8.8 శాతంగా ఉండేది. ఆ తర్వాత.. EPFO ​​తన కోట్లాది మంది చందాదారులకు EPF డిపాజిట్ రేటును క్రమంగా తగ్గించింది. 2020 మార్చిలో COVID మహమ్మారి సమయంలో EPF డిపాజిట్ రేటులో గణనీయమైన తగ్గింపు చోటుచేసుకోగా.. అప్పడు ఏకంగా ఏడేళ్ల కనిష్టానికి అంటే 8.5 శాతానికి తగ్గించింది. EPFO ​​తన చందాదారులకు 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది.

Also Read : India’s Q3 GDP : మూడో త్రైమాసిక వృద్ధి రేటు విడుదల – ట్రంప్ సుంకాలు కొంపముంచనున్నాయా?

భారత్ లోని సంఘటిత కార్మికుల రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఏర్పాటైన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో ప్రస్తుతం 6.5 కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. వీరంతా నెలవారీగా మదుపు చేస్తుండగా.. ప్రతీ ఉద్యోగి తన జీతంలో 12%, యజమాని 12% చొప్పున ప్రతి నెలా ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంటారు. ఈ మొత్తాలకు ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో తిరిగి నెలకు కొంత చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారు. అలా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ నిల్వలపై 8.25% చక్రవడ్డీ లభించనుంది. కాగా.. ఈపీఎఫ్ చందాదారులు పన్ను మినహాయింపు, ముందస్తు ఉపసంహరణ, బీమా వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×