Trump Calls Zelenskyy Not Peacemaker | ఖనిజాల తవ్వకం ఒప్పందంపై చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. శాంతి చర్చలకు జెలెన్స్కీ తిరిగి వచ్చినప్పటికీ, అందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. ఈ భేటీలో ఘర్షణ తర్వాత విలేకరులతో మాట్లాడిన ట్రంప్, “మేము ఈ రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యాం. ఈ సమావేశంలో ఆయన కొంచెం అతిగా చేసినట్లు నాకు అనిపించింది. మేము శాంతి కోసం చూస్తున్నాం, కానీ ఆయన దాన్ని కోరుకుంటున్నట్లుగా నాకు అనిపించలేదు. మరో పదేళ్ల పాటు యుద్ధం చేస్తూ ఆటలాడాలని మేము అనుకోవడం లేదు. శాంతి నెలకొల్పాలని నేను చూస్తుంటే, ఆయన మరొక దాన్ని ఆశిస్తున్నారు. మాకు తక్షణమే శాంతి కావాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెలెన్స్కీతో శాంతి చర్చలు కొనసాగిస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించగా, ఆయన అందుకు రావాలనుకుంటున్నారు కానీ తాను అందుకు సిద్ధంగా లేనని ట్రంప్ బదులిచ్చారు. జెలెన్స్కీ శాంతి కోరుకోవడం లేదు, ఆయన అలాంటి వ్యక్తే కాదని కూడా విమర్శించారు.
జరిగదానికి నేను క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు.. జెలెన్‌స్కీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల భేటీ నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఘటనపై మాట్లాడారు. వైట్ హౌస్ లో జరిగిన ఘటనపై ట్రంప్ నకు క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉందా అని ఒక విలేకరి ప్రశ్నించగా, దీనికి జెలెన్స్కీ బదులిస్తూ, “అలాంటిదేమీ లేదు. నేను అధ్యక్షుడిని, అమెరికన్ ప్రజలను గౌరవిస్తాను. నేను ఏదో తప్పు చేశానని అనుకోవడం లేదు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి, ఇలా చేస్తే స్నేహం ఎక్కడ ఉంది?” అని అమెరికాను ఉద్దేశించి అన్నారు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమేనని స్పష్టం చేశారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య సంబంధం పైనా జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని, తమ వైపే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓవల్ ఆఫీసులోని ఘర్షణ ఇరుపక్షాలకు మంచిది కాదన్నారు. రష్యా పై ఉన్న అభిప్రాయాన్ని తాను మార్చుకోలేనని స్పష్టం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందంతో పాటు కీవ్ లోని అరుదైన ఖనిజాల తవ్వకం వంటి కీలక అంశాలపై మాట్లాడేందుకు ట్రంప్ తో జెలెన్స్కీ భేటీ అయ్యారు. భవిష్యత్తులో తమ పై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ఒత్తిడి చేశారు. ట్రంప్ మరియు ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ లకు ఇది ఆగ్రహం తెప్పించింది. దీంతో, ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదని, ఇది అవమానకరంగా ఉందని ట్రంప్ ఖండించారు. ఇలాగైతే లాభం లేదని తేల్చి చెప్పేశారు. డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉక్రెయిన్ లేదంటూ మండిపడ్డారు. దీనికి జెలెన్స్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. తమ దేశంలో తాము ఉంటున్నామని, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదన్నారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జెలెన్స్కీ అమెరికా తో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడినుంచి వెనుదిరిగారు.
JD Vance and Trump just put Zelensky in his place. Wow. Watch this.
— End Wokeness (@EndWokeness) February 28, 2025
విసిగిపోయిన ఉక్రెయిన్ రాయబారి
అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు కాస్తా రసాభాసగా మారాయి. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్స్కీ వైట్ హౌస్ ను వీడారు. అయితే మీడియా ఎదుటే వీరిద్దరి మధ్య వాడీవేడి చర్చ చోటు చేసుకోవడంతో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. ట్రంప్, జెలెన్స్కీ మధ్య సజావుగానే మొదలైన భేటీ కాసేపటికే వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని, జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ఆ సమయంలో ఇరుదేశాల రాయబారులు ఎదురుగానే ఉన్నారు. ట్రంప్ మాటలకు జెలెన్స్కీ ఎదురు చెబుతుండడంతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి అయిన ఒక్సానా గందరగోళానికి గురయ్యారు. “అయ్యో.. ఇలా జరుగుతుందేంటీ?” అన్నట్లుగా తల పట్టుకున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
She is Ambassador of Ukraine to US.
She is so stressed uncomfortable and literally in state of crying despite tough trainings.
But libtards agenda has started.
— DeepDownAnalysis (@deepdownanlyz) March 1, 2025
WATCH IN FULL: All 46 minutes of the Oval Office meeting between President Donald J. Trump and President Zelenskyy pic.twitter.com/L88QejnhRA
— Rapid Response 47 (@RapidResponse47) February 28, 2025