Today Gold Rate: గత కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా.. బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ.. రికార్డు స్థాయికి చేరాయి. మన దేశంలోనూ 10 గ్రాముల బంగారం ధర ఏకంగా లక్ష చేరువలో ఉంది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ రిపోర్టులు చెబుతున్నాయి. సంప్రదాయకంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు వ్యతిరేకంగా.. రక్షణ కవచంగా భావించే బంగారం ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 26 శాతం వరకు పెరిగింది. యూఎస్ సుంకాలు రేకెత్తించిన మాంద్యం భయాలతో.. గోల్డ్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం రేటు రికార్డు స్థాయిలో 3500 డాలర్లు తాకింది. ఇప్పుడు.. డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ లాంటి అంశాలు.. గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతున్నాయి.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,750కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,910 వద్ద కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలోనే 2 వేల వరకు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. అమెరికా డాలర్ బలపడటం, గ్లోబ్ వైడ్‌గా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం లాంటి కారణాలు బంగారం ధరలపై ఎఫెక్ట్ చూపాయి.
ఎప్పుడైతే.. బంగారం లక్ష మార్క్ దాటిందో.. అప్పటి నుంచి దేశీయంగా బంగారం కొనుగోళ్లలో డిమాండ్ తగ్గిపోయింది. చాలా మంది తమ కొనుగోళ్లను కూడా వాయిదా వేసుకున్నారు. అయితే.. ఈ ధరల తగ్గుదల తాత్కాలికమా.. దీర్ఘకాలం కొనసాగుతుందా అనేదానిపైనా కొంత సందిగ్ధత నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ఒడిదుడుకులు, దేశీయ డిమాండ్ సరళిని బట్టి.. బంగారం ధరలు మారే అవకాశం ఉంది. అయితే.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరిగిపోవడంతో మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు వచ్చే 12 నెలల్లో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉందనే నివేదికలు కూడా వస్తున్నాయి. మరో ఏడాదిలో.. ఔన్స్ బంగారం ధర 2500 డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. సాధారణంగా బంగారంపై ఓ స్థాయి వరకు ప్రతిస్పందన ఉంటుంది. కానీ.. ప్రస్తుతం జరుగుతున్నది ఓవర్ రియాక్షన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న రిపోర్టుల ప్రకారం.. ఔన్సు బంగారం ధర 2500 డాలర్లకు తగ్గుతుందని చెబుతున్నారు. అంటే.. 10 గ్రాముల బంగారం ధర 75 వేలకు దిగొస్తుంది.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,900 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,060 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,12,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,01, 000 వద్ద కొనసాగుతోంది.