Bus Accident: కర్ణాటకలో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. అదుపు తప్పి రోడ్డు పైన వెలుతున్న రెండు బైకులను ఢీకొట్టి పక్కే ఉన్న డ్రైనేజీలో పడిపోయింది. ఇందులో నలుగురు చనిపోగా.. ఏడుగురికి గాయిలు అయినట్లు తెలిపారు. చనిపోయిన ముగ్గురిలో ఒకరు SI నాగరాజు ఉన్నట్లుగా తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిలో SI కుమార్తే కావ్య కూడా ఉన్నట్లు తెలిపారే. అక్కడి సమీపంలోని స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అసలు ఈ ఆక్సిడెంట్ల ఎందుకు జరిగింది? ఈ డ్రైవర్ డ్రింక్ చేసి ఉన్నారా? లేకపోతే అతివేగమే దీనికి కారణమా అనే దాని పై పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టారు.
Also Read: భర్తను చితకబాది చంపేసిన భార్య.. ఇంట్లో సిసిటీవి కెమెరాలు పెట్టాడని..
అయితే ఈ బస్సు కనకపర నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వారు ఐసియూలో చికిత్స పొందుతున్నారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్పంగా గాయాలు అయినట్లు తెలిపారు. అయితే విచారణ సమయంలో, స్టీరింగ్ కేబుల్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ పేర్కొన్నాడు. కాగా వంపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, అధిక వేగంతో వెళ్లకూడదని అధికారులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా సరూర్ నగర్‌లో తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డు ప్రమాదం.. అపార్ట్మెంట్ పక్కన పార్కింగ్ చేసిన రెండు కార్లను వేగంగా ఢీ కొట్టిన షిఫ్ట్ కారు.. ఈ ప్రమాదంలో 3 కార్లు.. దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం అనంతరం కార్ డ్రైవర్ పరారై పోయాడు. అయితే కారులో బీరు సీసాలు లభ్యమవడంతో మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు.