Today Gold Rate: మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది. మంగళవారంతో పోలిస్తే.. బంగారం ధర రూ.500 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,750 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ లక్షకు చేరువలో ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఇప్పటివరకు బంగారం ధర సుమారు రూ.20 వేల 800కు పైగా పెరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పరుగు ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించట్లేదు. అక్షయ తృతీయ పండుగ నాడు బంగారం ధర భారీగా తగ్గింది. ఆ తర్వాత మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి.
యూఎస్ డాలర్ విలువ పెరగడం వల్ల.. ఇతర కరెన్సీలతో కొనుగోలు చేసే వారికి బంగారం ఖరీదైనదిగా మారింది. దాంతో.. డిమాండ్ తగ్గింది. ముఖ్యంగా.. అమెరికా-చైనా మధ్య వాణిజ్యం విషయంలో ఉద్రిక్తతలు కూడా బంగారం ధరలపై ఎఫెక్ట్ చూపించింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులతో గోల్డ్ రేట్లు పెరిగిపోయాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో అశాంతి, అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలన్నీ.. బంగారం డిమాండ్‌ని పెంచాయి. మరోవైపు.. ప్రపంచ వ్యాప్తంగా ధరల పెరుగుదలతో.. బంగారాన్ని ఇన్‌ఫ్లేషన్‌కు వ్యతిరేకంగా రక్షణగా భావించారు.
ఇదులా ఉంటే.. స్టాక్ మార్కెట్ బలపడేకొద్దీ బంగారం ధర తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎవరైతే ఇన్వెస్టర్లు ఇప్పటివరకు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టారో.. వారంతా తమ పెట్టుబడుల్ని ఉపసంహరించి మళ్లీ స్టాక్ మార్కెట్‌లో పెట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు అయితే ఆకాశాన్ని తాకాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99, 000 కి చేరుకుంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,750 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99, 000 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,900ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99, 150 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,750 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99, 000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99, 000 పలుకుతోంది.
వెండి ధరలు
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,11,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,000 వద్ద కొనసాగుతోంది.