E-Paper
Advertisement

Realme GT Concept: చార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై..రియల్‌మీ 10,000mAh సూపర్‌ బ్యాటరీ ఫోన్

Realme GT Concept: చార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై..రియల్‌మీ 10,000mAh సూపర్‌ బ్యాటరీ ఫోన్
Advertisement

Realme GT Concept: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రోజుకో కొత్త ఆవిష్కరణ జనాలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే రియల్‌మీ మరో ముందడగు వేసి తన GT కాన్సెప్ట్ ఫోన్‌తో సంచలనం సృష్టించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 10,000mAh భారీ బ్యాటరీతో వస్తుండటం విశేషం. సన్నని డిజైన్‌లో వస్తున్న ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన 320W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు బ్యాటరీ లైఫ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఇది కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.

320W ఫాస్ట్ ఛార్జింగ్
రియల్‌మీ GT కాన్సెప్ట్ ఫోన్‌లో 320W ఫాస్ట్ ఛార్జింగ్ సాంకేతికతను అందిస్తోంది. దీని వల్ల ఈ భారీ 10,000mAh బ్యాటరీని కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు సమయాన్ని ఆదా చేసి, నిరంతర వినియోగానికి అవకాశం కల్పిస్తుంది. బిగ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నప్పటికీ, రియల్‌మీ ఈ ఫోన్‌ను సన్నగా, తేలికగా ఉండటం విశేషం. ఇది బ్యాటరీతో కూడిన స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో విప్లవాత్మక మార్పును సూచిస్తుందని చెప్పవచ్చు.

Advertisement

డిస్ప్లే
ఈ కాన్సెప్ట్ ఫోన్‌లో అధునాతన AMOLED డిస్ప్లేను అందిస్తున్నారు. ఇది అధిక రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. HDR10+ సపోర్ట్ తో, వీడియోలు, గేమింగ్‌లో అద్భుతమైన విజువల్ అనుభవాన్ని పొందవచ్చు.

Read Also: Lava Yuva 2 Star: రూ.6 వేలకే 8జీబీ RAM స్మార్ట్‌ఫోన్‌..మిగతా …

Advertisement

పనితీరు, ప్రాసెసర్
ప్రముఖ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్, ఫోటోగ్రఫీ వంటి వాటిని సునాయాసంగా నిర్వహించుకోవచ్చు.

కెమెరా సిస్టమ్
రియల్‌మీ GT కాన్సెప్ట్ ఫోన్‌లో అధిక రిజల్యూషన్ ప్రధాన కెమెరా, అల్ట్రావైడ్, మ్యాక్రో లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో సెల్ఫీ కెమెరా కూడా మంచి క్లారిటీని అందిస్తుంది.

భవిష్యత్తు స్మార్ట్‌ఫోన్‌లకు (Realme GT Concept)
రియల్‌మీ ఈ కాన్సెప్ట్ ఫోన్‌తో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో తన కృషిని మరోసారి రుజువు చేసింది. భారీ బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్, సన్నని డిజైన్ వంటి ప్రత్యేకతలు దీన్ని భవిష్యత్తు స్మార్ట్‌ఫోన్‌లకు మార్గదర్శకంగా నిలిపాయని చెప్పవచ్చు.

ఒకే ఫోన్ ద్వారా
ఇది వినియోగదారులకు అధిక సామర్థ్యం, వేగవంతమైన ఛార్జింగ్, సన్నని డిజైన్‌ను ఒకే ఫోన్ ద్వారా అందిస్తోంది. భవిష్యత్తులో ఈ కాన్సెప్ట్ ఫోన్ విడుదలైతే, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పెద్ద ప్రభావం చూపించనుంది. దీంతోపాటు ఇతర కంపెనీలకు కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×