Operation Sindoor 9 Key Targets: భారత సైన్యం బుధవారం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని భూభాగంపై వైమానిక దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. అయితే ఈ దాడులు ఇండియాకు హాని తలపెట్టే ఉగ్రవాద స్థావరాలపై చాలా కచ్చితత్వంతో జరిగాయి. ఉగ్రవాదులకు ఈ స్థావరాలు చాలా కీలకం అయినందునే భారత సైన్యం ఈ దాడులు చేసింది.
ఆ స్థావరాలు పాక్ భూభాగంలో ఎక్కుడున్నాయంటే..
1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ – (జైశే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ)
2. మర్కజ్ తైబా, మురిద్కే – (లష్కరే తయిబా)
3. సర్జల్, టెహ్రా కలాన్ – (జైశే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ)
4. మెహమూనా జోయా, సియాల్‌కోట్ – (హిజ్బుల్ ముజాహిదీన్)
5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా – (లష్కరే తయిబా)
6. మర్కజ్ అబ్బాస్, కోట్లి – (జైశే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ)
7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి – (హిజ్బుల్ ముజాహిదీన్)
8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ – (లష్కరే తయిబా)
9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ – (జైశే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ)
ఈ 9 స్థావరాల్లో ఏం జరుగుతోంది?
1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ – (జైశే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ)
ఈ స్థావరంల జైశే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ప్రధాన కార్యాలయం లాంటిది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని భావల్‌పూర్ పరిసరాల్లో ఉంది. ఇక్కడ అభంశుభం ఎరుగని టీనేజర్లను తీసుకొని వచ్చి వారిని బ్రెయిన్ వాష్ చేసి కరుడు గట్టిన ఉగ్రవాదులుగా శిక్షణ ఇస్తారు. పుల్వామా లో జరిగిన ఉగ్రదాడి చేసింది.. ఇక్కడ శిక్షణ పొందినవారే. ఇది చాలా పెద్ద శిక్షణ కేంద్రం. కనీసం 600 మందికి ఇక్కడ నివాస సదుపాయం ఉంది.
2. మర్కజ్ తైబా, మురిద్కే – (లష్కరే తయిబా)
మర్కజ్ అంటే హెడ్ క్వార్టర్స్ (ప్రధాన కార్యాలయం). మర్కజ్ తైబా పాకిస్తాన్ లోని లాహోర్ నగరానికి సమీపంలో ఉంది. లష్కరే తయిబా ఉగ్రవాద సంస్థకు అతిపెద్ద ట్రైనింగ్ క్యాంప్ ఇది. మొత్తం 82 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. ఇందులో మద్రసాలు, ఇళ్లు, చేపల ఫాం లాంటివి నిర్మాణాలు ఉన్నాయి. 26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులు చేసింది.. ఇక్కడ శిక్షణ పొందినవారే. ఇప్పటికీ ఇక్కడ ఉగ్రవాదులకు మతం పేరుతో హత్య చేయాలని అడ్వాన్స్‌డ్ ఆయుధాల శిక్షణ ఇస్తున్నారు.
3.సర్జల్/తెహ్రా కాలన్ ఫెసిలిటీ (జైశే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ)
జైశే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఈ ట్రైనింగ్ బేస్ భారత జమ్మూ కశ్మీర్ కు చాలా సమీపంగా ఉంది. పాకిస్తాన్ లోని శాకర్‌గడ్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు రహస్యంగా సొరంగాలు తవ్వి భారత్ లోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ నుంచే డ్రోన్ల ద్వారా ఆయుధాలు భారత్ భూభాగానికి సరఫరా చేస్తున్నారు.
4.మెహమూనా జోయా, సియాల్‌కోట్ పాకిస్తాన్ – (హిజ్బుల్ ముజాహిదీన్)
హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ లోని సియాల్ కోట్ నగరం సమీపంలోని మెహమూనా జోయా ప్రాంతంలో ఉగ్రవాద స్థావరం కలిగి ఉంది. ఇక్కడి నుంచి భారత్ లోని జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులు దొంగచాటున ఎలా ప్రవేశించాలో శిక్షణ పొందుతారు. జమ్మూ ఎక్కువ శాతం జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఇర్ఫాన్ టాండా అనే ఉగ్రవాది కీలక పాత్ర పోషించాడు. అతను దాడులు చేసిన తరువాత ఈ స్థావరంలోనే తలదాచుకేనేవాడని ఇంటెలిజెన్స్ సమాచారం.
5.మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా – (లష్కరే తయిబా)
ఇది లష్కరే తయిబాకి చాలా కీలక స్థావరం. ఇది పాకిస్తాన్ లోని బర్నాలా పట్టణంలో ఉంది. ఇక్కడి నుంచి ఉగ్రవాదులను జమ్ములోని పూంచ్, రాజౌరీ, రియీసి సెక్టర్లలో చొరబడతారు.ఇక్కడ సాధారణంగా 40 నుంచి 50 మంది ఉగ్రవాదులు ఉంటారని తెలిసింది.
6. మర్కజ్ అబ్బాస్, కోట్లి – (జైశే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ)
ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉంది. పాకిస్తాన్ లోని పఠాన్ కోట్ లో ఉగ్రవాద స్థావరం నాశనం అయిన తరువాత జైశే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ పఠాన్ కోట్ కార్యకలాపాలన్నీ ఇప్పుడు సియాల్ కోట్ కు మార్చింది. ఇక్కడే ఉగ్రవాదులు.. భారీ సంఖ్యలో ఆయుధాలు, రాకెట్ లాంచర్స్ నిల్వ చేసినట్లు సమాచారం.
Also Read: భారత పౌరులను చంపిన పాక్ ఆర్మీ.. జమ్మూలో 8 మంది అమాయకులు మృతి
7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి – (హిజ్బుల్ ముజాహిదీన్)
ఇది చాలా పురాతన శిక్షణా కేంద్రం. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ అడవి, కొండ ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ ఉగ్రవాదులకు కఠిన సమయంలో ఎలా జీవించాలి. అడవిలో ఎలా తిండి లేకుండా జీవించాలి. తుపాకీతో సుదూరంగా దాగి ఉండి గురి చూసి ఎలా చంపాలి, ఇతర బాంబులు, రాకెట్లు ఎలా ప్రయోగించాలి అనే విధానాలకు ఇక్కడ నేర్పిస్తారు. దాదాపు 25 నుంచి 30 ఇక్కడ ఒకేసారి ట్రైనింగ్ తీసుకునేందుకు సౌలభ్యం ఉంది.
8.షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ – (లష్కరే తయిబా)
లష్కరే తయిబా ప్రధాన ట్రైనింగ్ సెంబర్ ఇది. ఈ స్థావరంలో 40 గదులున్నాయి. ట్రైనింగ్ కోసం ఇక్కడ గ్రౌండ్స్, ఫైరింగ్ రేంజ్ ఉన్నాయి. ఇక్కడే పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు కీలక శిక్షణ ఇస్తుంది.
9.సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్
ఇది ఒక ట్రాన్సిట్ క్యాంప్ మాత్రమే అంటే. ఒక చోట శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు ఈ స్థావరంలో తాత్కాలికంగా బస చేసి అక్కడి నుంచి భారత భూభాగంలోకి చొరబడతారు. పాకిస్తానీ స్పెషల్ ఫోర్సెస్ ఇక్కడే వారికి శిక్షణలో తుది మెరుగులు దిద్దుతారు.
ఈ ఉగ్రవాద స్థావరాలన్నీ పాకిస్తాన్ ఆర్మీ అండదండలతో, పాక్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐ నేతృత్వంలో పనిచేస్తున్నాయి.