BigTV English
Advertisement

Bhumika Chawla : ఈ వయస్సులో రిస్క్ అవసరమా..ఏకీపారేస్తోన్న నెటిజన్లు..

Bhumika Chawla : ఈ వయస్సులో రిస్క్ అవసరమా..ఏకీపారేస్తోన్న నెటిజన్లు..

Bhumika Chawla : టాలీవుడ్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ భూమిక చావ్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరుసగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరితో నటించడం పాటుగా ఎన్నో హిట్ సినిమాలను సొంతం చేసుకుంది. అప్పటిలో హీరోలకు ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. చూడటానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే భూమిక చావ్లా ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపారు . ఉత్తరాది అమ్మాయే అయినా తెలుగు చిత్రాలతోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు.. ఈమె క్లీవేజ్ షో చేయకుండా ట్రెడిషనల్ వేర్‌లోనే పద్ధతిగా కనిపించేవారు. ఆ తర్వాత కొత్త అమ్మాయిల రాకతో ఆమెకు అవకాశాలు తగ్గాయి . సీనియర్ హీరోయిన్లంతా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈమె కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తుంది. ఇక తాజాగా భూమిక బైక్ స్టంట్ చేసిన ఫోటో ఒకటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


తాజాగా ఈమె హార్లే డేవిడ్సన్ బైక్‌ను నడిపి సంచలనం సృష్టించారు భూమిక. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ వీడియోను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ వయసులోనూ మీరు ఏమాత్రం తగ్గడం లేదని కొందరు చెబుతుండగా.. బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని తెలియదా అంటూ ఇంకొందరు నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ వార్త కాస్త చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి.. ఏది ఏమైనా కూడా భూమిక ఈ వయస్సులో కూడా ఫిజిక్ ను బాగానే మెయింటైన్ చేస్తుంది. హీరోయిన్లను మించి అందంగా ఉంది. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే సింహాద్రి, ఒక్కడు, వాసు, స్నేహమంటే ఇదేరా, జై చిరంజీవా, సాంబ, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాలలో నటించి మెప్పించింది.. ఈమె ఇప్పటి వరకు నటించిన ప్రతి సినిమా మంచి రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇక కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన స్నేహితుడుతో ప్రేమలో పడింది. ఆ తర్వాత 2007 లో పెళ్లి చేసుకుంది భూమిక చావ్లా పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన భూమిక సెకండ్ ఇన్నింగ్స్‌లో తన వయసు, ఇమేజ్‌కి తగిన పాత్రలే చేస్తున్నారు భూమిక. ఎంఎస్ ధోని బయోపిక్, మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, సినిమాల గురించి కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఏవో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఈమె లీడ్ రోల్ లో చేసిన ప్రతి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. దాంతో ఈమెకు వరుస ఆఫర్స్ పలకరిస్తున్నాయి. ఈ మధ్య తమిళ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరి ఎలాంటి పాత్రల్లో నటిస్తుందో చూడాలి..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×