BigTV English

TRAI Fake Calls: ఫేక్ కాల్స్ పై కేంద్రం కొరడా.. ఏకంగా 2.75 మొబైల్ నెంబర్లు బ్లాక్!

TRAI Fake Calls: ఫేక్ కాల్స్ పై కేంద్రం కొరడా.. ఏకంగా 2.75 మొబైల్ నెంబర్లు బ్లాక్!

TRAI Fake Calls: ప్రజలకు తరుచూ ఫేక్ కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న టెలీ మార్కెటింగ్ కంపెనీలు, సైబర్ మోసగాళ్ల పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్).. ఈ ఫేక్ కాల్స్, ఫేక్ మెసేజ్ ల సమస్యకు చెక్ పెట్టడానికి కఠిన చర్యలు చేపట్టింది. దాదాపు 2.75 లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసింది. భారీ సంఖ్యలో టెలీ మార్కెటింగ్ కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేసింది.


వివరాల్లోకి వెళితే.. పెరిగిపోతున్న ఫేక్ కాల్స్, ఫేక్ మెసేజ్ ల ఫిర్యాదులపై తీసుకుంటూ.. రిజిస్ట్రేషన్ లేని టెలీమార్కెటర్స్ ని బ్లాక్ లిస్ట్ చేస్తూ.. ఫేక్ కాల్స్, ఫేక్ మెసేజ్ లకు ఉపయోగించబడిన 2.75 లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసింది. అయితే ఈ కఠిన నిర్ణయం తీసుకునే నెలల ముందు నుంచే టెలీ మార్కెటింగ్ కంపెనీలకు ట్రాయ్ హెచ్చరిస్తూ వచ్చింది. ఇందుల భాగంగానే 50 టెలీ మార్కెటింగ్ కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేసింది.

అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
అక్టోబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. బ్లాక్ లిస్ట్ చేసిన టెలీ మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ 1 నుంచి ఏ వ్యక్తికి కూడా ఎటువంటి లింక్ లున్న మెసేజ్ లు పంపించేందుకు వీలుండదు. అలా పంపించాలంటే ట్రాయ్ అనుమతులు తప్పనిసరి. ఈ నిబంధనలు ఆగస్టు 31 నుంచే అమలు లోకి రావాల్సి ఉండగా.. ఆ కంపెనీలకు సెప్టెంబర్ 30, 2024 వరకు గడువు పొడిగించారు. టెలీ మార్టెటింగ్ కంపెనీలకు బల్క్ మెసేజీలు చేసే వీలుంటుంది. వారు ఈ సౌలభ్యాన్ని దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది ట్రాయ్.


2024 విపరీతంగా పెరిగిన స్పామ్ కాల్స్:
2024 సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలో స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగాయని ట్రాయ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ స్పామ్ కాల్స్ సమస్యపై టెలీమార్కెటింగ్ కంపెనీలకు వ్యతిరేకంగా జనవరి 2024 నుంచి జూన్ 2024 కాలం మధ్య 7.9 లక్షల ఫిర్యాదులు అందాయని ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది.

ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటూ వెంటనే ప్రొమోషనల్ వాయిస్ కాల్స్ ఆపేయాలని టెలికామ్ కంపెనీలు.. (జియో, ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా) లకు ఆగస్టు 13, 2024 న ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటిస్తూ.. టెలికామ్ కంపెనీలు ఇప్పటివరకు 2.75 లక్షల మొబైల్ నెంబర్లు బ్లాక్ చేశాయి. 50 టెలికామ్ మార్కెటింగ్ కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేశాయి.

ఆ తరువాత ఆగస్టు 8, 2024న టెలికామ్ కంపెనీల ప్రతినిధులతో ట్రాయ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. పైగా ఒక టెలికామ్ కంపెనీతో కనెక్షన్ తీసుకున్న ఒక టెలీమార్కెటింగ్ కంపెనీ వివరాలు మరో టెలికామ్ కంపెనీకి తెలపాలి. దీని వల్ల అన్ని టెలికామ్ కంపెనీలు సదరు బ్లాక్ లిస్ట్ అయిన టెలీమార్కెటింగ్ కంపెనలు వేరే టెలికామ్ కంపెనీ వద్ద కనెక్షన్ తీసుకోవడానికి వీలుండదు.

Also Read:  ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!

Related News

EPFO Pension Hike: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. కనీస పెన్షన్ ​​రూ. 2,500 పెంచే ఛాన్స్

Gold Markets: దేశంలో అతిపెద్ద బంగారం మార్కెట్లు.. ఇక్కడ వేలకొద్ది గోల్డ్ షాపులు, లక్షల కోట్ల వ్యాపారం

Today Gold Price: బిగ్ బ్రేకింగ్.. 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు

Mugdha 2.0: కూకట్ పల్లిలో సరికొత్తగా ముగ్ధా 2.0.. ప్రారంభించిన ఓజీ బ్యూటీ ప్రియాంక మోహనన్!

Diwali Offers: దీపావళి రీఛార్జ్ ఆఫర్లు తెలుసా?.. బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్, వీఐ స్పెషల్ ప్లాన్స్ ఇవే!

Amazon Offers: అమెజాన్ షాపింగ్ పై 10% అదనపు క్యాష్‌బ్యాక్ .. సిఎస్‌బి బ్యాంక్ కొత్త ఆఫర్!

Cheque Clearance: ఇకపై గంటల్లోనే చెక్ క్లియరెన్స్.. ఇవాళ్టి నుంచి కొత్త రూల్ అమలు!

2 Thousand Note: మీ దగ్గర ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? ఈ వార్త మీకోసమే

Big Stories

×