Ticket Deposit Receipt| రైలు ప్రయాణం చేసేవారందరికీ ట్రైన్ లేటుగా రావడం అనుభవం చేసే ఉంటారు. ఈ కారణంగా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత లేటుగా ప్రయాణం చేసే బదులు అసలు ప్రయాణమే రద్దు చేసుకొని.. బస్సు లేదా కారు మార్గాన వెళ్లడం మేలు అని ప్రయాణీకులు భావించిన సందర్భాలెన్నో ఉంటాయి. కానీ ప్రయాణం రద్దు చేసుకుంటే రైలు టికెట్ డబ్బులు నష్టపోతామని మనసు అంగీకరించదు.
కానీ బాధపడాల్సిన అవసరం లేదు. టికెట్ డబ్బులు మీకు రీఫండ్ జరుగుతాయి. దీనికోసం రైల్వే శాఖ ప్రయాణీకుల కోసం ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. అదే టిడిఆర్ (టికెట్ డిపాజిట్ రిసీట్). టిడిఆర్ ద్వారా మీ టికెట్ డబ్బులు ఎలా తిరిగి పొందాలి? ఆ ప్రక్రియ ఏంటి? అనే వివరాలు మీ కోసం.
Ticket Deposit Receipt- టికెట్ డిపాజిట్ రిసీట్ అంటే ఏంటి?
ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ ఒక వెసలుబాటు తీసుకొచ్చింది. ట్రైన్ ఆలస్యంగా ప్రయాణంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా కనీసం మూడు గంటలు ఆలస్యమైతేనే టికెట్ రీఫండ్ పొందేందుకు ప్రయాణీకులు అర్హులవుతారు. అంటే ట్రైన్ నియమిత షెడ్యూల్ కన్నా మూడు గంటలు ఆలస్యంగా ప్రయాణంలో ఉంటేనే టికెట్ రిఫండ్ కోసం ప్రయాణీకులు అప్లై చేసుకోవచ్చు. అంతేకానీ ప్రయాణీకులు టికెట్ క్యాన్సెల్ చేయడం, లేదా వ్యక్తిగత కారణాల వల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకునే సందర్భాల్లో ఇది వర్తించదు.
టికెట్ రిఫండ్ డబ్బులు ఎప్పటిలోగా అందుతాయనేది కూడా గమనించాల్సిన విషయం. రిఫండ్ డబ్బులు ప్రయాణీకులకు రెండు గంటలలోపు లభిస్తాయి. ఉదాహరణకు షెడ్యూల్ ప్రకారం.. ట్రైన్ మీరు టికెట్ బుక్ చేసుకున్న స్టేషన్ నుంచి 8 గంటలకు బయలు దేరాలి.. కానీ ప్రయాణం మూడు గంటలు లేదా అంతకన్నా ఆలస్య మవుతోంది. అలాంటి సందర్భంలో మీరు 8 గంటలకు టికెట్ రీఫండ్ కోసం అప్లై చేస్తే.. 10 గంటల లోపు రిఫండ్ లభిస్తుంది. అయితే రిఫండ్ కోసం కనీసం ట్రైన్ వచ్చే ఒక గంట ముందు వరకు అప్లై చేసుకోవాలి. ఇదంతా రైల్వే కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన టికెట్ కు మాత్రమే వర్తిస్తుంది. రిఫండ్ పొందడానికి రైల్వే కౌంటర్ వద్ద టిడిఆర్ ఫామ్ తీసుకొని మీ టికెట్ వివరాలు నింపి ఇవ్వండి.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..
ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణీకులు కూడా టిడిఆర్ అప్లై చేసుకోవచ్చు. కానీ వారికి రిఫండ్ 72 గంటలలో లభిస్తుంది. ఆన్ లైన్ టిడిఆర్ ఫామ్ ఐఆర్ సిటిసి యాప్ లో ఫిల్ అప్ చేసుకోవచ్చు.
ఇదే కాకుండా రైల్వే శాఖ కొన్ని సందర్భాల్లో ట్రైన్ రద్దు చేస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా టిడిఆర్ ద్వారా టికెట్ డబ్బులు తిరిగి పొందవచ్చు. అందరికీ ఉపయోగపడే ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయండి.
Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్