BigTV English

Deepthi Jeevanji wins Bronze: పారా ఒలింపిక్స్‌లో భారత్ జోరు.. తెలంగాణ అమ్మాయికి కాంస్య పతకం..సీఎం రేవంత్ అభినందనలు

Deepthi Jeevanji wins Bronze: పారా ఒలింపిక్స్‌లో భారత్ జోరు.. తెలంగాణ అమ్మాయికి కాంస్య పతకం..సీఎం రేవంత్ అభినందనలు

Deepthi Jeevanji wins Bronze: పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు జోరు మీదున్నారు. తాజాగా తెలుగమ్మాయి 400 మీటర్ల ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. దీంతో భారత్ ఖాతాలోకి ఇప్పటి వరకు 20 పతకాలు చేరాయి. గతంలో టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాల రికార్డు బద్దలైంది.


పారిస్ పారా ఒలింపిక్స్‌లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. భారత్ ఖాతాలోకి ఇప్పటి వరకు 20 పతకాలు చేరాయి. అందులో మూడు బంగారం, ఏడు రజతం, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన అథ్లెట్ దీప్తి జీవాంజి టీమ్ కాంస్య పతకం సాధించింది.

ALSO READ:  ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్.. ఫైనల్ డేట్ ఫిక్స్


మంగళవారం రాత్రి జరిగిన 400 మీటర్ల టీమ్ విభాగం ఫైనల్‌లో ఆమె పతకం సాధించింది. దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని థర్డ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. ఉక్రెయిన్ అమ్మాయి షులియార్ 55.16 సెకన్లలో గోల్డ్ అందుకోగా, తుర్కియే ఐజెల్-55.23 సెకన్లతో రజతం సొంతం చేసుకుంది.

పారాలింపిక్స్‌లో దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి మనందరికీ గొప్ప స్ఫూర్తి అంటూ పేర్కొన్నారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపించింది. అంతకుముందు వరకు 400 మీటర్ల టీ-20 విభాగంలో ఈమెదే (55.07 సెకన్లు) ప్రపంచ రికార్డు. ప్రస్తుతం దీప్తి రికార్డు బద్దలైంది. పాఠశాల నుంచి దీప్తికి పరుగుల రాణిగా పేరు ఉండేది.

ఆమెని గమనించిన పీఈటీ ప్రొత్సహించారు. ఆ తర్వాత జూనియర్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ కఠిన ట్రైనింగ్ తీసుకుంది. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ సెంటర్‌లో జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ప్రయాణం సాగుతూ వచ్చింది. చివరకు పారా ఒలింపిక్స్‌లో తన కలను నెర్చుకుంది.

 

 

Related News

Tilak Varma : గిల్ కోసం బలి పశువు అవుతున్న నెంబర్ 2లో తిలక్ వర్మ.. ఏంట్రా ఈ రాజకీయాలు అంటూ గంభీర్ పై ఫైర్

Asia Cup 2025: దరిద్రం అంటే ఇదే.. ఆసియా కప్ 2025 లో ఈ తోపు క్రికెటర్లను మిస్ కాబోతున్నాం

Umpire Injured: ఎంతకు తెగించార్రా… ఏకంగా అంపైర్ ప్రైవేట్ పార్ట్స్ పైనే దాడి చేసిన బంగ్లా ప్లేయర్లు

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కారు నెంబర్ సీక్రెట్ ఇదే.. లక్షలు పెట్టి మరి కొన్నాడా!

Pujara on Ashwin: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అశ్విన్ ?

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి గిల్, సిరాజ్ ఔట్… టీమిండియా తుది జట్టు ఇదే !

Big Stories

×