BigTV English

Trump: ట్రంప్ నిర్ణయాలు.. కంప్యూటర్ల ధరలకు రెక్కలు, వాటితోపాటు

Trump: ట్రంప్ నిర్ణయాలు.. కంప్యూటర్ల ధరలకు రెక్కలు, వాటితోపాటు

Trump: అమెరికాతో ప్రపంచదేశాలకు ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతుందా? అదే జరిగితే ఎలక్ట్రానిక్స్ ఆధారిత ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశముందా? ముఖ్యంగా కంప్యూటర్స్ వాటి ప్రభావం పడుతోందా? అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ట్రంప్ నిర్ణయాలపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మాటలతో దారికి తెచ్చుకోవడం, లేకుంటే బెదిరించడం.. ఇదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రాటజీ. ఆయన అధికారంలోకి వచ్చిన నుంచి ఈ ఫార్ములాను అవలంబిస్తున్నారు. ట్రేడ్ వార్ పేరిట పలు దేశాలపై విపరీతంగా టారిఫ్‌లు విధిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో కాకుండా పలు దేశాల్లో నిరసనలు లేకపోలేదు.

ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం కంప్యూటర్ చిప్‌లపై పడనుంది. ట్రంప్ ఓవల్ కార్యాలయంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో సమావేశం సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని విషయాలు బయటపెట్టారు. కంప్యూటర్ చిప్స్, సెమీ కండక్టర్లపై దాదాపు 100 శాతం సుంకం విధిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.


అమెరికాలో తయారీ కంపెనీలు చిప్స్, సెమీ కండక్టర్స్ తయారు చేస్తే ఎలాంటి సుంకాలు విధించరు. బయట దేశంలో తయారు చేసి అమెరికాలో దిగుమతి చేస్తే సుంకాలు తప్పవన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే అమెరికాలో ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌కు ఊపు వచ్చే అవకాశముందని అంటున్నారు.  దీనివల్ల చిప్స్, సెమీ కండక్టర్ ఆధారిత వస్తువులపై ధరల పెరిగే ఛాన్స్ ఉందని అంచనా.

ALSO READ: పీఎఫ్ డబ్బులతో ఇల్లు కట్టాలి అనుకుంటున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకే

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్.. తొలుత ఎలక్ట్రానిక్స్‌కు టారిఫ్‌ల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ విధానం తెచ్చారు. కొవిడ్-19 సమయంలో చిప్‌ల కొరత వల్ల కార్ల సహా పలు వస్తువుల ధరలు పెరిగాయి. దాని ప్రభావం ద్రవ్యోల్భణంపై పడింది.

ఈ నేపథ్యంలో చిప్‌లు తయారు చేసే కంపెనీలకు అమెరికా దిగుమతి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టినప్పటి టెక్ కంపెనీలు సుమారు 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భావించాయి. యాపిల్ సంస్థ ఫిబ్రవరిలో 5600 బిలియన్ పెట్టుబడులు పెంచుతున్నట్టు ప్రకటించింది.

ట్రంప్-కుక్ మధ్య ఒప్పందంలో చైనా, ఇండియాలో తయారయిన ఐఫోన్‌లు పాత టారిఫ్ ప్రకారం కంటిన్యూ అవుతుందా? రాబోయే కొత్త మోడళ్ల ధరలు పెరుగుతాయా? అనేదానిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ నిర్ణయంతో బుధవారం యాపిల్ షేర్లు 5 శాతం లాభపడింది. ట్రంప్ ప్రకటన తర్వాత మరో 3 శాతం షేర్లు పెరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ చిప్‌లకు అధిక డిమాండ్ ఉంది. జూన్‌తో ముగిసిన ఏడాదిలో అమ్మకాలు 19 శాతానికి పెరిగాయని వరల్డ్ సెమీ కండక్టర్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ తెలిపింది. బైడెన్ హయాంలో వచ్చిన ‘చిప్స్ అండ్ సైన్స్ యాక్ట్’కు భిన్నంగా ట్రంప్ నిర్ణయం ఉంది. బైడెన్ రూలింగ్‌లో చిప్ పరిశ్రమకు 50 బిలియన్ డాలర్ల నిధులను పన్ను రాయితీలు ఇచ్చింది.

టారిఫ్‌లను ఆయుధంగా చేసుకుని కంపెనీలు దేశీయంగా చిప్, సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయడానికి ట్రంప్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో కంపెనీలు పరిశ్రమలు స్థాపించేలా చేయాలన్నది ట్రంప్ ప్లాన్. దీనివల్ల ఫోన్‌లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related News

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Jio Prepaid Plans: వామ్మో .. ఏమిటి, జియో ఇన్ని రిచార్జ్ ప్లాన్స్ తొలగించిందా?

Foreclosing Loan: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?

Jio Recharge Offers: జియో బంపర్ ఆఫర్.. రీచార్జ్ చేసుకుంటే వెంటనే క్యాష్‌బ్యాక్!

BSNL Sim Post Office: పోస్టాఫీసులో BSNL సిమ్.. ఇక గ్రామాలకూ విస్తరించనున్న సేవలు

Big Stories

×