BigTV English

Kamindu Mendis: ఎవడ్రా వీడు.. పెళ్ళాన్ని వదిలేసి.. IPL ఆడేందుకు వచ్చాడు ?

Kamindu Mendis: ఎవడ్రా వీడు.. పెళ్ళాన్ని వదిలేసి.. IPL ఆడేందుకు వచ్చాడు ?

Kamindu Mendis: ఐపీఎల్ 2025 లో భాగంగా గురువారం రోజు కలకత్తా నైట్ రైడర్స్ – సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల జరిగిన మ్యాచ్ లో.. సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్.. సన్రైజర్స్ హైదరాబాద్ ని 80 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఆటగాడు కమిందు మెండీస్ {Kamindu Mendis} కి ఆడే అవకాశం లభించింది. ఈ మ్యాచ్ తోనే ఐపిఎల్ లో అరంగేట్రం చేశాడు మెండీస్.


Also Read: SRH In IPL 2025: SRH వరుస ఓటములు… కమిన్స్ కెప్టెన్సీ గల్లంతు…?

అయితే తొలి మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ సాధించలేని ఘనతను సాధించాడు. ఇతడిని ఐపీఎల్ 2025 మెగా వేలంలో హైదరాబాద్ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తొలి మ్యాచ్ లో ఇప్పటివరకు ఐపీఎల్ లో ఎవరూ చూడని అద్భుతాన్ని ఆవిష్కరించాడు. కమిందు మెండీస్ రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కుడి చేత్తో హాఫ్ స్పిన్, ఎడమ చేతితో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ వేయగల నైపుణ్యం అతడి సొంతం.


దీనిని అతడు తన తొలి ఓవర్ లోనే చూపించాడు. తొలి ఓవర్ లో కుడి చేతివాటం బ్యాటర్ రఘువంశీకి లెఫ్ట్ ఆర్మ్ తో 3 బంతులు వేసిన మెండిస్.. ఎడమ చేతి వాటం బ్యాటర్లు వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లకి హాఫ్ స్పిన్ తో మరో మూడు బంతులు వేశాడు. ఈ క్రమంలో రఘు వంశీ వికెట్ కూడా దక్కింది. కానీ అతడిని సమర్థవంతంగా వాడుకోవడంలో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విఫలమయ్యాడు.

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం మరొకటి ఏంటంటే.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పిలుపుతో ఈ శ్రీలంక ఆల్రౌండర్ తన హనీమూన్ ని వాయిదా వేసుకుని మరి ఐపీఎల్ 2025 లో ఆడుతూ ఉండడం చాలా అరుదైన విషయం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ కోసం తన హనీమూన్ ని కూడా మెండీస్ త్యాగం చేశాడని సమాచారం. మెండీస్ ఇటీవల తన గర్ల్ ఫ్రెండ్ నిష్ని ని వివాహం చేసుకున్నాడు.

Also Read: Ipl 2025: ఐపీఎల్ లో కలకలం… అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్న ప్లేయర్ ?

అంతకుముందే హనీమూన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ మ్యాచ్ కోసం దానిని క్యాన్సల్ చేసుకొని కలకత్తా వచ్చేసాడు. ఇక ఈ మ్యాచ్ లో ఒకే ఓవర్ వేసిన అతడు.. ఒక వికెట్ పడగొట్టాడు. అటు బ్యాటింగ్ లోను అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో 20 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్స్ లు, ఒక ఫోర్ ఉండడం గమనార్హం. అయితే తన హనీమూన్ కంటే ఐపీఎల్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో.. ఐపీఎల్ లీగ్ పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని చూపించాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Tags

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×