E-Paper
Advertisement

TVS Raider 125 Bike Sale: ఒక్క నెలలో 50,000 మంది కొన్న బైక్ ఇదే.. ధర కూడా చాలా తక్కువ!

TVS Raider 125 Bike Sale: ఒక్క నెలలో 50,000 మంది కొన్న బైక్ ఇదే.. ధర కూడా చాలా తక్కువ!
Advertisement

50,000 Units of TVS Raider 125 Bikes Sold out in Just 1 Month: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ రోజు రోజుకు అంచలంచలుగా ఎదుగుతోంది. కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చి బైక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సేల్స్‌లో దుమ్ము దులిపేస్తుంది. అయితే ఈ కంపెనీకి చెందిన ఓ బైక్ గత నెలలో అమ్మకాల్లో అదరగొట్టేసింది. ఎవరూ ఊహించని.. ఎవరూ కనీవిని ఎరుగని రీతిలో దూసుకుపోయింది. ఆ బైక్ మరేదో కాదు.. టీవీఎస్ రైడర్ 125 (tvs raider 125).

గత నెలలో టీవీఎస్ సంస్థ FY2024లో 29 శాతం వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 301449 యూనిట్లను టీవీఎస్ కంపెనీ సేల్ చేసినట్లు సమాచారం. అందులో 132339 యూనిట్లు లేదా 38 శాతం స్కూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మోటార్ సైకిళ్ల విషయానికొస్తే.. 127186 యూనిట్లు లేదా 24 శాతంగా నమోదయ్యాయి. ఇక అదే సమయంలో 20శాతం లేదా 41924 యూనిట్ల మోపెడ్‌లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే మార్కెట్లో జుపీటర్, ఎన్‌టార్క్ ఘనణీయమైన అమ్మకాలను నమోదు చేశాయి.

Advertisement

అయితే ఈ మొత్తం అమ్మకాల్లో అత్యధికంగా అమ్ముడైన బైక్ ఏదైనా ఉందంటే అది టీవీఎస్ రైడర్ 125 మాత్రమే అని చెప్పొచ్చు. గత ఒక్క నెలలోనే ఈ బైక్ 51098 యూనిట్ల సేల్ జరిగిందని SIAM డేటా ద్వారా వెల్లడైంది. గతేడాది 2023 ఏప్రిల్ కంటే ఈ ఏడాది అమ్మకాలు 62శాతం అధికమని తెలుస్తోంది. అయితే మోటార్ సైకిల్స్ విక్రయాల్లో రైడర్ 40 శాతం వాటా లేదా మొత్తం టూ వీలర్ వెహికల్స్ అమ్మకాల్లో 17 శాతం వాటాను కలిగి ఉంది. దీనిబట్టి చూస్తే టీవీఎస్‌ రైడర్ బైక్‌కు భారతదేశంలో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న బైక్‌లు ఇవే..!

Advertisement

ఇకపోతే ఈ బైక్ మార్కెట్‌లో రిలీజ్ అయినప్పటి నుంచి భారీ యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఏకంగా 800000 యూనిట్ల సేల్స్ జరిపింది. ఇక రాబోయే రోజుల్లో కూడా టీవీఎస్ రైడర్ అమ్మకాల్లో దూసుకుపోతుందని పలువురు అభిప్రాయం తెలుపుతున్నారు. కాగా ఈ బైక్ దాని డిజైన్, లుక్‌తో బైక్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ ధర కూడా ఎక్కువగా లేదు. దేశీయ మార్కెట్‌లో ఈ బైక్ రూ.95,219 నుంచి రూ.1.04 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది.

Tags

Related News

PPF vs SIP.. నెలకు రూ.10,000 పెట్టుబడి చేసేందుకు ఏది లాభదాయకం?

డిగ్రీ లేదు.. పెట్టుబడి లేదు.. రూ.కోట్ల వ్యాపారం చేస్తున్న 65 ఏళ్ల మహిళ

స్వతహాగా ఆదివారాలు, రాత్రిళ్లు కూడా పనిచేస్తున్న ఆ కంపెనీ ఉద్యోగులు.. డబ్బు కోసం కాదు

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

Big Stories

Advertisement
×