BigTV English

Amazon Holi Offer: హోలీకి అమెజాన్ క్రేజీ ఆఫర్లు.. కేవలం రూ. 899లకే ఇయర్ బడ్స్

Amazon Holi Offer: హోలీకి అమెజాన్ క్రేజీ ఆఫర్లు.. కేవలం రూ. 899లకే  ఇయర్ బడ్స్

 


Amazon Holi Offer
Amazon Holi Offer

Amazon Holi Offer: హోలీ పండగకు మరో రెండు రోజులే సమయం ఉంది. సోమవారం మార్చి 25న హోలీ పండుగ రానుండగా.. ఈ కామర్స్ వెబ్ సైట్లైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు క్రేజీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా అమెజాన్ హోలీ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ లో ఫోన్లు, గాడ్జెట్స్, పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

మార్చి 20 నుంచి అమెజాన్ హోలీ ఫెస్ట్ ఇన్ ఇండియా సేల్ ను ప్రారంభించింది. మార్చి 25వరకు అంటే హోలీ పండుగ రోజు వరకు డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం డిస్కౌంట్లు ప్రకటించింది. ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, వంటి వాటిపై భారీ ఆఫర్లు ఇచ్చింది. అయితే ఇందులో ఇయర్ బడ్స్ పై 75 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఇయర్ బడ్స్ పై 75 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. అంతేకాదు, దీంతో పాటు ఎస్బీఐ ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వారికి కంపెనీ అందిస్తున్న మరో 10 శాతం డిస్కౌంట్ కూడా వర్తిస్తుందని పేర్కొంది. అమెజాన్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం ప్రస్తుతం ఇయర్ బడ్స్ కేవలం రూ. 2000లోపే అందిస్తుంది.


బోట్ ఇయర్ బడ్స్..

అమెజాన్ హోలీ సేల్ లో బోట్ ఎయిర్ డోప్ 141 కేవలం రూ. 899లకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ 11 కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది దాదాపు 42 గంటలపాటు పనిచేస్తుంది. 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 75 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా వర్క్ అవుతోంది. అంతేకాదు, ఇది ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్, ఇన్ స్టాంట్ కనెక్ట్, ఐపీఎక్స్4 వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

నాయిస్ బడ్స్ ఎన్1

రూ. 1099లకే నాయిస్ బడ్స్ ఎన్1 అమెజాన్ హోలీ సేల్ లో లభిస్తుంది. ఇది నాలుగు కలర్లలో అందుబాటులో ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే దాదాపు 120 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా పనిచేస్తుంది. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్, బ్లూటూత్ వీ5.3 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

బోల్ట్ ఆడియో జెడ్40 ప్రో

రూ. 1,399లకే బోల్డ్ ఆడియో జెడ్40 ప్రో ఇయర్ బడ్స్ లభిస్తున్నాయి. ఇది ఏడు కలర్లలో అందుబాటులో ఉంది. దీని ప్లే బ్యాక్ టైం 100 గంటలు ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ 45ఎంఎస్ లో లెటెన్సీ మోడ్ తో గేమింగ్, క్వాడ్ మిక్ ఈఎన్సీ టెక్నాలజీని కలిగి ఉంది.

Tags

Related News

GOLD RATE IN DUBAI: దుబాయ్‌లో బంగారం ధర చాలా చీప్.. భారత్‌తో పోలిస్తే ఎంత డబ్బు ఆదా..?

Post Office Scheme: రూ. 5 లక్షల పెట్టుబడితో రూ. 10 లక్షల ఆదాయం.. వెంటనే ట్రై చేయండి!

BSNL Offers: రోజూ 2జీబీ డేటా, 160 రోజుల వ్యాలిడిటీ.. సెప్టెంబర్ లో BSNL బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఇదే!

Jio Offers: జియో రీఛార్జ్ చేసుకోండి, క్రేజీ క్యాష్ బ్యాక్ ఆఫర్ పట్టేయండి!

Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..!

Credit Card Limit: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామనే ఆఫర్ చూసి ఆశపడుతున్నారా…అయితే ఇది మీ కోసం…

Big Stories

×