Big Stories

IPL 2024 Double Header: నేడు ఐపీఎల్‌లో డబుల్ బొనాంజా.. కమిన్స్ సన్ రైజర్స్‌ రాత మార్చేనా..?

IPL 2024

- Advertisement -

IPL 2024 Double Header PBKS vs DC, KKR vs SRH: ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలి డబుల్ బొనాంజా వచ్చేసింది. శనివారం క్రికెట్ అభిమానులకు పండగే. తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానుంది.

- Advertisement -

ఇక రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

2022 డిసెంబర్‌లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ ద్వారా తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టనున్నాడు.

Also Read: విరాట్ కొహ్లీ పొమ్మన్నాడా? అలా అన్నాడా? నెట్టింట బిగ్ డిబేట్

గత 16 సీజన్‌లను పరిశీలిస్తే, PBKS, DC 2008 నుంచి ఒక్క IPL ట్రోఫీని కూడా గెలుచుకోలేదు. ఈ రెండు జట్లు గతంలో 32 సార్లు తలపడగా PBKS, DC రెండూ చేరో 16 గేమ్‌లు గెలిచాయి.

ఇక సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడనుంది. పాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ నూతనోత్సాహంతో ఉంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్‌కు అనుకూలమైన పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. IPLలో బ్యాటర్లకు అనుకూలమైన స్టేడియంగా ఇది నిలుస్తుంది. గత సీజన్‌లో ఇక్కడ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు జట్లు 200 పరుగుల మార్క్‌ను దాటాయి. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు నాలుగు సార్లు గెలుపొందగా, మూడు మ్యాచ్‌ల్లో ఛేజింగ్ జట్లు విజయం సాధించాయి. కాబట్టి ఇక్కడ ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ అంత కీలకం కాదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు జట్లు 25 సార్లు తలపడ్డాయి. కోల్‌కతా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గత సీజన్‌లో చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ రాతను కమిన్స్ మారుస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News