Drinking Beer in Summer: కల్లు, బీర్ తాగడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా వీకెండ్స్, పండగలు, ఫంక్షన్ల సమయంలో కల్లు, బీర్ తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కల్లు రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఈత చెట్టు నుండి తీసే ఈత కల్లు కాస్త టేస్టీగా ఉంటుంది.
సేకరించిన వెంటనే తాగితే ఇందులోని పోషకాలు శరీరానికి కొంత వరకు మేలు చేస్తాయిని చెబుతారు. ఈత కల్లులో కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా చెట్టు నుండి తీసిన వెంటనే తాగితే ఇవి శరీరానికి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆల్కహాల్ గా మారిన తర్వాత తీసుకుంటే మాత్రం లాభాల కంటే నష్టాలే ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ సమయం నిల్వ ఉంచిన కల్లులో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల మీ ఆలోచన, స్పందించే చర్యలపై ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా కాల్షియం, మెదడు, గుండె, ఇతర అవయవాలకు కూడా హాని కలిగిస్తుంది. సమ్మర్ లో ఎక్కువగా ఆల్కహాల్ తాగినా కూడా కూడా అది శరీరానికి అంత మంచిది కాదు. కల్లును సరిగ్గా నిల్వ చేయకపోతే అది డీహైడ్రేషన్, డయేరియా, ఫుడ్ ఫాయిజనింగ్‌కు కారణం అవుతుంది.
కల్లు ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇది గాలి, లేదా వేడికి తొందరగా చెడి పోతుంది. ఇలా నిల్వ చేసిన కల్లులో హానికరమైన సూక్ష్మ జీవులు ఉంటాయి. అంతే కాకుండా టాక్సిన్స్ చేరే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కల్లు తాగడం వల్ల మీకు వాంతులు, వికారం, అతిసారం, వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కల్లు అతిగా తీసుకోవడం వల్ల రక్త పోటు, మూత్ర పిండాల పనితీరు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది.
కల్లు అనేది ఒక సహజమైన డ్రింక్. దీనిని మితంగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో అనామ్లజనకాలు, ప్రోబయోటిక్స్ ఉంటాయి. అయినప్పటికీ, మీరు ఎక్కువగా లేదా చాలా తరచుగా త్రాగితే లేదా సరిగ్గా నిల్వ చేయకపోయినా లేదా సరిగ్గా తయారు చేయకపోయినా ఇది ఆల్కహాల్ సంబంధిత సమస్యలు, డీహైడ్రేషన్, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, బ్లడ్ షుగర్ స్పైక్‌లకు కారణమవుతుంది. అందుకే మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా ఏవైనా మందులు తీసుకుంటే కల్లు తాగే ముందు మీరు మీ డాక్టర్‌ను సంప్రదించాలి.
Also Read: కొబ్బరి నీళ్లు తాగితే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !
బీర్ తాగితే ?
తరచుగా బీర్ తాగే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్ లో చాలా మంది బీర్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇది అంత మంచిది కాదు. బీర్‌లో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. అందుకే ఎక్కువగా బీర్ తాగడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా ఊబకాయం బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది.
బీర్ ఎక్కువగా తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే బీర్ తాగకుండా ఉంటేనే మంచిది. సమ్మర్‌లో బీర్ ఎక్కువగా తాగినా కూడా ఫ్యాటీ లివర్ బారిన పడతారు. అంతే కాకుండా లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదిలా ఉంటే బీర్ తాగితే న్యూరో ట్రాన్సిమిటర్ల పని తీరు కూడా తగ్గి ఆలోచనా సామర్థ్యం కూడా తగ్గుతుంది.