BigTV English

Rajinikanth : రజినీకాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

Rajinikanth : రజినీకాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

Rajinikanth : తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తుంది. ఈయనకు కడుపు నొప్పి తో పాటుగా గుండె సమస్యల చెకప్ కోసం చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ అపోలోలో సోమవారం రాత్రి చేరినట్లు తెలుస్తుంది. 73 ఏళ్ల నటుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ టీమ్ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆసుపత్రి దగ్గరకు భారీగా చేరుకొని తమ హీరోకు ఎలా ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రజినీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..


సూపర్ స్టార్ రజినీ కాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వెట్టయాన్ సినిమాలో నటిస్తున్నాడు. రజినీ 170 సినిమాగా ఈ మూవీ రాబోతుంది. ఆసుపత్రిలో చేరడానికి ముందు, రజనీకాంత్ ఇటీవల తన రాబోయే చిత్రం వేట్టయాన్ ఆడియో లాంచ్‌లో కనిపించారు. అక్టోబరు 10న థియేటర్లలో విడుదల కానున్న వేట్టయాన్ ఆడియో వేడుకలో హుషారేత్తే డ్యాన్స్ లతో స్టేజ్ పై సందడి చేస్తూ కనిపించారు రజినీ.. ఆ తర్వాత ఇలాంటి అనారోగ్యానికి గురవ్వడం ఆయన ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. హీరో కోలుకోవాలని, ఎటువంటి సమస్యకు రాకూడదు అని ఫ్యాన్స్ పూజలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే రజినీకాంత్ కాస్త అస్వస్థతకు గురవ్వడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు అన్ని రకాల టెస్టులు చేసిన వైద్య బృందం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆయనను అబ్జెర్వేషన్ లో ఉంచినట్లు తెలుస్తుంది. ఈ వార్త విన్న ఆయన ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌ల ‘వెట్టయన్’ ట్రైలర్ గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2 న విడుదల చేయటబోతున్నారు .ఈ చిత్రం అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. చిత్ర నిర్మాతలు ఇటీవల రజనీకాంత్ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్ చాలా స్టైలిష్ లుక్‌లో గాజులు ధరించి కనిపిస్తారు. ఈ మూవీలో ఎంకౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో రజినీకాంత్ నటిస్తున్నాడు. రీసెంట్ గా జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×