Viral Video: ఇటీవల రైలులో ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రైలులో ప్రయాణించాలంటే భయం పుట్టేలా ఉంటుంది పరిస్థితి. కనీసం నిలుచునేందుకు కూడా స్థలం లేకుండా, ఏసీ బోగీల్లోను నిల్చుని ప్రయాణిస్తున్న వీడియోలు ఇటీవల పదుల సంఖ్యలో వీడియోలో నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాడ కూడా రైల్వే అధికారులు తీసుకునే చర్యల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండడం లేదు.
తాజాగా ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులు దారుణంగా ప్రయాణించారు. ఏకంగా టాయిలెట్ ఏరియా దగ్గర నిద్రిస్తూ.. కనీసం ఒక అడుగు వేయాలన్నా కూడా స్థలం లేని ఇరుకు ప్రదేశంలో పడుకుని, కూర్చుని, నిలబడి ప్రయాణించారు. మరికొందరు స్థలం దొరక్క ఇబ్బందులు పడ్డారు.
ఓవైపు టాయిలెట్ కంపు, మరోవైపు అక్కడే ఇష్టం వచ్చినట్లు యూజ్ చేసిన వాష్ బేషన్ కూడా ఉంది. డోర్ పక్కన పడుకుని మరి, మహిళలు, పురుషులు, చిన్న పిల్లలతో సహా చాలా దారుణంగా ప్రయాణించారు.
ఇదంతా ఏసీ కోచ్‌లలో వెలుగు చూడడం ఆశ్చర్యానికి గురిచేసింది. రైలులోని ఏసీ కోచ్‌లలో కూడా ప్రయాణికులు మరీ ఇంత ఇరుకుగా ప్రయాణిస్తున్నారా అని నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భారతదేశంలో దేని పరిస్థితి మారినా కూడా రైల్వే పరిస్థితి మాత్రం అస్సలు మారట్లేదని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వాటిపై రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Sleeper Coach, Train No. 18237 Bilaspur Amritsar Chhattisgarh Express.
What's Happening? Situation Wasn't As Bad As Today Years Ago.
People Travelling Like Animals In Normal Trains And We Are Boasting About Vande Bharat And Bullet Trains????
— ਹਤਿੰਦਰ ਸਿੰਘ (@Rajput131313) June 13, 2024