EMI Delay Issues: ప్రస్తుత కాలంలో ట్రెండ్ మారుతోంది. నిద్ర లేవగానే మొబైల్ చూడటం, కాఫీ తాగుతూ ఆన్‌లైన్ షాపింగ్ చేయడం. కార్ షోరూమ్ వెళ్లకుండానే లోన్ అప్లై చేస్తాం. ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద మొత్తం ఖర్చు చేయడం కన్నా నెలకు కొద్దిగా కట్టడం మేలనిపిస్తోంది. ఒకప్పుడు ‘EMI’ అంటే పెద్ద కుటుంబాలు తీసుకునే రిస్క్ అనిపించేది.
ఏది కావాలంటే
కానీ ఇప్పుడు అది ఓ సాధారణ జీవనశైలి మార్గంగా మారిపోయింది. ఫోన్ కావాలా? ఫ్రిజ్ కావాలా? టీవీ, కారు, ఇల్లు కానీ ఏది కావాలంటే అది EMI ద్వారా వచ్చేస్తుంది. కానీ వీటిని పరిమితికి మంచి తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈఎంఐలు అప్పుడప్పుడు చెల్లించడం ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలో మనకు లాభమా, నష్టమా? అనేదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలస్యం అంటే ఎంత ఆలస్యం?
ఈఎంఐ పేమెంట్‌కు సాధారణంగా నెలరోజుల గడువు మాత్రమే ఉంటుంది. అయితే మీరు డ్యూట్ డేట్‌ను మిస్ అయితే మొదట “గ్రేస్ పీరియడ్” ఉంటుంది. ఇది కొన్ని బ్యాంకులు 3 రోజులు, మరికొన్ని 5 రోజులు ఇస్తాయి. ఈ గ్రేస్ పీరియడ్ లోపలే చెల్లిస్తే ఏ ఫైన్ ఉండదు. కానీ దీని తర్వాత చెల్లిస్తే మాత్రం ఆలస్య చెల్లింపు వల్ల జరిమానా పడుతుంది. కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ అమౌంట్ వసూలు చేస్తాయి. (ఉదాహరణకు రూ.500), మరికొన్ని 2% నుంచి 3% వరకు ఆలస్య రేటును వడ్డీగా పెడతాయి.
డ్యూకు వడ్డీ కూడా
మీ డ్యూకు వడ్డీ కూడా కౌంట్ అవుతుంది. అంటే మీరు ఫైన్ తోపాటు వడ్డీ కూడా చెల్లించాలి.
Read Also: Smartphone Overheating: ఎండాకాలంలో చక్కటి సొల్యూషన్.. …
బౌన్స్ ఛార్జెస్ (చెక్ లేదా ECS ఫెయిలైతే)
మీరు ECS లేదా పోస్ట్ డేటెడ్ చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నట్లయితే బౌన్స్ అయితే అదనంగా రూ.300 నుంచి రూ. 750 వరకు ఛార్జ్ పడుతుంది. ఆలస్యం చేయడం వల్ల మీ CIBIL స్కోర్ కూడా దెబ్బతింటుంది. ఒక EMI ఆలస్యమైనా కూడా అది మీ క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపిస్తుంది. ఇది ఫ్యూచర్‌లో మీకు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది.
ఆలస్యం చేస్తే ఫైనాన్షియల్ ఇమేజ్ ఎలా దెబ్బతింటుంది
CIBIL స్కోర్ డిక్లైన్: 750కి పైగా ఉన్న మంచి స్కోర్ కూడా ఒక్కసారి ఆలస్యం చేయగానే 30-50 పాయింట్లు తగ్గిపోతుంది
ఫ్యూచర్ లోన్లపై ప్రభావం: మీ స్కోర్ బాగోలేకపోతే బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లు డిమాండ్ చేస్తాయి లేదా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాయి.
నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA): 90 రోజులకు మించిన డ్యూస్ ఉంటే, బ్యాంక్ ట్యాగ్ చేస్తుంది. ఇది మీ ఫైనాన్షియల్ రిప్యూటేషన్‌కి పెద్ద నష్టం.
ఆలస్యం కాకుండా ఉండేందుకు స్మార్ట్ టిప్స్
-మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా EMI వెళ్తే మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.
-EMI చెల్లింపు reminder సెటప్ చేయండి
-మొబైల్ calendar లేదా UPI apps లో reminder పెట్టుకోండి.
-కనీసం 1 నెల EMI జీతం వచ్చిన వెంటనే విడిగా పెట్టండి. దీనివల్ల అనుకోని ఖర్చు వచ్చినా EMI మిస్ కాదు.
-జీతాన్ని దృష్టిలో పెట్టుకొని manageable EMIలు మాత్రమే తీసుకోవాలి.
-CIBIL కి కరెక్షన్ రిక్వెస్ట్ పంపండి: మీరు వాస్తవంగా చెల్లించినా అప్డేట్ కాలేదంటే కరెక్షన్ అడగవచ్చు.