Kejriwal Pushpa Dance| ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సతీమణితో కలిసి డాన్స్ చేశారు. ఆయన ఇంట్లో జరిగిన పెళ్లితో బంధువులందరి ముందు చిందులు వేశారు. . ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీత కేజ్రీవాల్‌తో కలిసి డాన్స్ వేయడం ప్రత్యేకం. వారి కుమార్తె హర్షిత, ఐఐటీలో తన క్లాస్‌మేట్‌గా ఉన్న సంభవ్ జైన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ వేడుక ఏప్రిల్ 18న ఢిల్లీలోని కపుర్తల హౌస్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది.
ఈ గ్రాండ్ మ్యారేజ్ వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితర ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. హర్షిత కేజ్రీవాల్, సంభవ్ జైన్ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక హర్షిత ప్రీ-వెడ్డింగ్ వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి ‘పుష్ప’ సినిమాలోని పాపులర్ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తన నటనతో అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలోని పాటలు, డైలాగులు, పుష్ప రాజ్ మేనరిజం అన్నీ.. ప్రజలకు బాగా నచ్చాయి.
#arvindkejriwal #dancevideo #delhiaap pic.twitter.com/1hObFExoGU
— Khushbu Goyal (@kgoyal466) April 18, 2025
పుష్ప సినిమాలోని జాతర పాటకు కేజ్రీవాల్ తన భార్యతో కలిసి స్టెప్పులు వేయడంతో అందరూ ఆశ్చర్య పోయారు. అంతేకాకుండా, పెళ్లి వేడుకకు హాజరైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పంజాబీ స్టైల్లో చిందులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. పంజాబ్ ముఖ్యమంత్రి ఇంతకుముందు సినిమాల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో పెళ్లిలో వచ్చిన అతిథులను తన ప్రదర్శనతో బాగానే ఆకట్టుకున్నారు.
Punjab CM Bhagwant Mann performing at the engagement ceremony of Kejriwal's daughter in Delhi.#Bhagwantmann #ArvindKejriwal pic.twitter.com/Vy9PqA4Teu
— Raajeev Chopra (@Raajeev_Chopra) April 18, 2025
ఇక వధూవరుల వివరాల విషయానికొస్తే.. సంభవ్ జైన్ ఐఐటీ ఢిల్లీలో చదువుకున్నారు. అదే విధంగా హర్షిత కూడా ఐఐటీ ఢిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. చదువుకునే సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇరువైపు కుటుంబాల అంగీకరించడంతో ఈ ప్రేమ వివాహం జరిగింది. గ్రాడ్యుయేషన్ తర్వాత హర్షిత గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో అసోసియేట్ కన్సల్టెంట్‌గా పని చేశారు. సంభవ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి ‘బసిల్ హెల్త్’ పేరుతో ఓ స్టార్టప్‌ను కూడా ప్రారంభించారు.
Also Read: 23 నిమిషాల్లో 102 ఖరీదైన వాచీలు చోరీ.. పోలీస్ స్టేషన్ పక్కనే దొంగతనం
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లకు సిద్ధమవుతున్నారు. 2026లో జరుగబోయే పంజాబ్ ఎన్నికలకు ఇప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను రంగంలో దించి ఎన్నికల వ్యూహాలను అమలుపరుస్తున్నారని సమాచారం.