BigTV English

Gold Rate: బంగారం ధర త‌గ్గుతుందా.. పెరుగుతుందా.. ఫ్యూచ‌ర్‌ ప‌రిస్థితి ఇదే..!

Gold Rate: బంగారం ధర త‌గ్గుతుందా.. పెరుగుతుందా.. ఫ్యూచ‌ర్‌ ప‌రిస్థితి ఇదే..!

ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఇద్రిక్తతల ప్రభావంతో బంగారం ధర ఏడాది కాలంగా పెరుగుతూనే ఉంది. అనిశ్చిత పరిస్థితుల్లో ఆదుకునే నమ్మకమైన పెట్టుబడి సాధనంగా.. బంగారాన్ని అందరూ భావిస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో బంగారం ధరలు పెరగడానికి కారణం అవుతుంది. 2024లో వరుసగా మూడు సార్లు పావు శాతం చొప్పున అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించింది. ఇక ఈ ఏడాది వడ్డీ రేట్లు తగ్గించకపోయిన.. అలాగే కొనసాగినా కూడా బంగారానికి అనుకూలమే అని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్లు తగ్గాలని పదే పదే చెబుతున్నారు. అంటే రానున్న కాలంలో అమెరికాలో వడ్డీ రేట్లు మరింత దిగొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది కనకానికి మరింత కిక్కిచ్చే అంశం. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని నమ్ముకుంటున్నాయి.

2024 నవంబర్‌లో 53 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా.. ఇందులో భారత్ వాటా 8 టన్నులు. నవంబర్‌లో జరిగిన కొనుగోలుతో 2024లో ఆర్టీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసి రెండో అతిపెద్ద కొనుగోలుదారుగాలు నిలిచింది. పోలార్డ్ నేషనల్ బ్యాంకు 90 టన్నులకొని టాప్‌లో నిలిచింది. ఇలా సెంట్రల్ బ్యాంక్‌లు ఎడాపెడా పసిడి కొనుగోలుకు దిగడం కూడా బంగారం రేట్లు పెరుగుదలకు కారణం అవుతుంది. అంతర్జాతీయంగా పసిడి ధరలు మించి భారత్‌దేశంలో బంగారం ధర పెరుగుతుంది. గత ఏడాది చివర్లో పండగ సీజన్లకు తోడు, పెళ్లిల్లు కూడా ఉండడంతో ఆభరణాలు రిటైల్డ్ కొనుగోల్లు పెరిగాయి. గత నవంబర్‌లో భారత్ పది మిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతార్జాతీయంగా గోల్డ్ రష్‌కి తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు రిటైర్ల నుంచి కొనుగోలు మద్దతు, డాలర్లతో రూపాయి మార్కం విలువ అంతకంతకు దిగజారుతుండడం.. పసిడి ధరలు పెరగడానికి కారణం అని విశ్లేషకులు అంటున్నారు.


Also Read: రూ. 5 లక్షల లోన్ కావాలా.. తక్కువ వడ్డీతో ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..

దేశీయంగా జనవరి నెలలోనే 5.5 శాతం అంటే.. 4,360 రూపాయలు పెరిగింది. గత వారం రోజుల్లోనే 2 శాతం 1,700 రూపాయలు జంప్ చేసింది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కారణం రూపాయి విలువ తగ్గడమే. రోజు రోజుకూ బక్క చిక్కుతున్న రూపాయి విలువ తాజాగా 86.85 ఆల్ టైమ్ కనిష్టానికి జారిపోయింది. ఇందులో ట్రంప్ గెలిచిన రోజు నుంచి చూస్తే.. రూపాయి విలువ 250 పైసలు తగ్గింది. అంతర్జాతీయం బంగారం ఔన్స్ ధర 24న గరిష్ఠానికి తాకి ప్రస్తుతం 2,795 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. డాలర్ పుంజుకొని , రూపాయి పడిపోవడం.. బంగారం దిగుమతులు కోసం ఎక్కువ రూపాయి చెల్లించుకోవాల్సి రావడమే దీనికి ప్రధాన కారణం. బంగారం పోయిన ఏడాది నిజంగా కనక వర్షమే కురిపించింది.

అంతర్జాతీయంగా దేశీయంగా దాదాపు 25 నుంచి 30 శాతం మేర రాబడులు అందించి అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా నిలిచింది. ప్రస్తుతం రాజకీయ ఆర్ధిక పరిస్థుల నేపథ్యంలో.. ప్రపంచ మార్కెట్లో పసిడి దూకుడు ఈ ఏడాది కూడా ఎక్కువగానే ఉంటుందని బిలియన్ నిపుణులు ఖచ్చితంగా చెబుతున్నారు. మరి కొంత మంది విశ్లేషకులు చెబుతున్న తాజా అంచనా ప్రకారం ఈ ఏడాది బంగారం ధర ఔన్సుకు 3,150 డాలర్లు తాకే అవకాశం ఉంది. ఏడాది చివరికల్లా 3,150 నుండి 3,356 డాలర్ రేంజ్‌లో స్థిరపడవచ్చని లెక్కకట్టారు. ఇక మన రూపాయి ఇలానే పడిపోతూ దేశీయంగా ఆభకరణాల డిమాండ్ పెరిగితో అక్షరాల లక్ష రూపాయలు తాకడం ఖాయమేనని మెజారిటీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Related News

Gold Rate: అమ్మ బాబోయ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ పండగ సేల్ ప్రారంభం.. భారీ ఆఫర్ల వర్షం

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

Big Stories

×