BigTV English

Ashes Of 400 Hindus: భారత్‌కు చేరిన 400 లకు పైగా పాకిస్తానీ హిందువుల చితాభస్మం, ఏళ్ల నిరీక్షణ ఎందుకంటే ?

Ashes Of 400 Hindus: భారత్‌కు చేరిన 400 లకు పైగా పాకిస్తానీ హిందువుల చితాభస్మం, ఏళ్ల నిరీక్షణ ఎందుకంటే ?

Ashes Of 400 Hindus: పాకిస్థానీ హిందువుల చితాభస్మాన్ని కలిగి ఉన్న 400 కి పైగా కలషాలు ఎట్టకేలకు ఏళ్ల నిరీక్షణ తర్వాత వాఘా సరిహద్దుకు చేరుకున్నాయి. ఉత్తరాఖండ్ రాష్టంలోని హరిద్వార్ కు తీసుకువెళ్ల అక్కడ అస్థికలు నదిలో కలపనున్నారు.


పాకిస్తాన్ హిందువులు తమ కుటుంభ సభ్యులు, సన్నిహితుల అంతిమ సంస్కారాలను హిందూ మత సాంప్రదాయం ప్రకారం నిర్వహించాలని అనుకున్నారు. ఈ మేరకు భారత విభజన జరిగిన తర్వాత 3వ సారి 400 మందికి పైగా అస్థికలను భారత్‌కు తీసుకువచ్చారు. కుంభ మేళా సందర్భంగా 8 ఏళ్ల తర్వాత చితాభస్మాన్ని భారత్ కు తీసుకువచ్చారు. మరి పాకిస్తానీ హిందువుల చితాభస్మం ఇండియాకు రావడానికి 8 ఏళ్ల ఎందుకు నిరీక్షణ ఎందుకు పట్టింది ? ఇందుకు ప్రధానంగా కృషి చేసిన వ్యక్తి ఎవరనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్తాన్‌ కరాచీలోని పాత గోలిమార్ శ్మశానవాటికలో 400 మంది మరణించిన హిందువుల అస్థికలు నిమజ్జనం కోసం సంవత్సరాలుగా వేచి ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం హిందూ కుటుంబాలు తమ ప్రియమైన వారి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేయాలని కోరుకున్నారు. కానీ వీసా ఇబ్బందుల కారణంగా అది సాధ్యం కాలేదు. సోమవారం ఫిబ్రవరి 3న ఈ అస్థికలు చివరకు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని వాఘా-అట్టారి సరిహద్దు ద్వారా భారతదేశానికి చేరుకున్నాయి. ఈ మొత్తం ప్రక్రియలో శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ , సామాజిక కార్యకర్తలు ముఖ్యమైన పాత్ర పోషించారు.


మహా కుంభ మేళా సమయంలో చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకురావడానికి అనుమతి లభించింది. భారత ప్రభుత్వం ఈ చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకురావడానికి వీసా జారీ చేసింది. చితాభస్మాలను తీసుకురావడానికి ముందుగా ఆదివారం ఫిబ్రవరి 2న కరాచీలోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థన సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ మృతుల కుటుంబాలు తమ వారి జ్ఖాపకాలను మరో సారి గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఆచారాల ప్రకారం తుది వీడ్కోలు పలికారు. పాకిస్తాన్ నుండి హిందువుల చితాభస్మాన్ని భారతదేశానికి పంపడం ఇదే మొదటిసారి కాదు, కానీ ఈసారి ఈ సంఖ్య అత్యధికం.

వీసా దొరకకపోవడంతో, సింధు నదిలో కలపాలని చేయాలని ప్లాన్ చేశారు:
పాకిస్తాన్‌లో నివసించే ప్రజలు ఈ రోజు కోసం 8 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే వారి చితాభస్మాన్ని సింధు నదిలో నిమజ్జనం చేయవలసి వచ్చేది. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం గంగానదిని మోక్షదాతగా భావిస్తారు. కాబట్టి పాకిస్తానీ హిందువులు హరిద్వార్ లో చితాభస్మాన్ని కలపాలని అనుకున్నారు. మహా కుంభమేళా వంటి పవిత్ర సమయంలో చితాభస్మాన్ని నిమజ్జనం చేసే అవకాశం లభించడం పట్ల పాకిస్తాన్ హిందువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీ రామ్ నాథ్ మిశ్రా మహారాజ్:
400 చితాభస్మ కలశాలతో భారతదేశానికి చేరుకున్నారు. శ్రీ రామ్ నాథ్ మిశ్రా మహారాజ్ 400 చితాభస్మ కలశాలతో భారతదేశానికి చేరుకున్నారు. గతంలో, 2011లో 135 అస్థికలు , 2016లో 160 అస్థికలను హరిద్వార్‌కు పంపారు. కానీ ఈసారి ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రయాణ సమయంలో సురక్షితంగా ఉండటానికి బూడిద ఉన్న కలశాలను సాంప్రదాయ మట్టి కుండలలో కాకుండా తెల్లటి ప్లాస్టిక్ జాడిలో ఉంచామని మిశ్రా మహారాజ్ తెలిపారు. ఈ అస్థికలకు వాఘా సరిహద్దు వద్ద హిందూ సంస్థలు , కుటుంబాలు స్వాగతించాయి.

Also Read: దేశంలో అత్యధిక మహిళా పోలీసులు ఉన్న రాష్ట్రాలు ఇవే.. ఏపీ ప్లేస్ ఎంతో తెలుసా?

భారతదేశానికి చేరుకున్న చితాభస్మాన్ని నేరుగా హరిద్వార్‌కు పంపుతారు. అక్కడ రాబోయే రెండు వారాల పాటు ప్రత్యేక మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు . ఈ గొప్ప పనిలో సహకరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని శ్రీ రామ్ నాథ్ మిశ్రా మహారాజ్ అన్నారు. మహాకుంభ మేళా ముగిసే వరకు, శ్రీ రామ్ నాథ్ మిశ్రా మహారాజ్ హరిద్వార్‌లోనే ఉండి, మరణించిన ఆత్మల శాంతి కోసం ప్రార్థిస్తారు. అన్ని ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ అస్థికలను సరైన పద్ధతిలో గంగానదిలో నిమజ్జనం చేస్తారు.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×