BigTV English

Cheques: చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేస్తారో మీకు తెలుసా?

Cheques: చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేస్తారో మీకు తెలుసా?

Cheques Signe: ఈ రోజుల్లో చాలా వరకు డబ్బులను ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. అయినప్పటికీ, పెద్ద మొత్తంలో డబ్బులను బదిలీ చేయడానికి చెక్కులను ఉపయోగిస్తున్నారు. అయితే, చెక్ బ్యాంకులో డిపాజిట్ చేసే సమయంలో వెనుక వైపు సంతకం చేస్తారు. అయితే, చెక్ ముందు వైపు సంతకం చేస్తే సరిపోదా? వెనుకవైపు ఎందుకు సంతకం చేయాలి? అనే అనుమానం చాలా మందికి వస్తుంది. ఈ సంతకం వెనుక కొన్ని బ్యాంకు నియమ నిబంధనలు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


చెక్కు వెనుక సంతకం చేయడం ద్వారా చెక్కు లబ్దిదారుడు తాను చెక్కును స్వీకరిస్తున్నట్లు కన్ఫార్మ్ చేసినట్లు అవుతుంది. ఈ చెక్కు చట్టబద్దంగా ఉపయోగించబడుతున్నట్లు నిర్థారిస్తుంది. వాస్తవానికి బేరర్ చెక్కులతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. చెక్కుపైన పేర్కొన్న వ్యక్తి మాత్రమే కాకుండా, చెక్కును కలిగి ఉన్న వ్యక్తి కూడా డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. దుర్వినియోగాన్ని నివారించడానికి, గుర్తింపు, రికార్డ్ కీపింగ్ కోసం బ్యాంకులు వెనుక సంతకం  తీసుకుంటాయి.

ఏ చెక్కులకు వెనుక సంతకం అవసరం?


నిజానికి ఖాతా చెల్లింపుదారు చెక్కులు అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు.  అవి చెక్ మీద రెండు సమాంతర గీతలు గీయడంతో పాటు ‘ఖాతా చెల్లింపుదారునికి మాత్రమే’ అని రాస్తారు. ఈ డబ్బులు నేరుగా ఉద్దేశించిన ఖాతాలోకి జమ అవుతాయి. అటువంటి చెక్కులకు, వెనుక సంతకం అవసరం లేదు. “For deposit only” అని రాసి సంతకం చేస్తే, చెక్కు కేవలం ఖాతాలో జమ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. చెక్కును మరొక వ్యక్తికి బదిలీ చేయాలనుకుంటే, వెనుక సంతకం చేయడం ద్వారా ఆ ప్రక్రియ సులభమవుతుంది. ఉదాహరణకు, “Pay to the order of [NAME]” అని రాసి సంతకం చేస్తే, చెక్కు ఆ వ్యక్తికి చెల్లుబాటవుతుంది.  RBI నిబంధనల ప్రకారం.. బేరర్ చెక్కుల వెనుక మాత్రమే సంతకం అవసరం. బేరర్ చెక్కును వేరొకరి పేరు మీద జమ చేస్తే, బ్యాంకు ధృవీకరణ కోసం డిపాజిటర్ సంతకాన్ని సేకరిస్తుంది. కొన్ని సందర్భాల్లో చెక్కును పేర్కొన్న వ్యక్తి ఖాతాలో జమ చేసినప్పుడు బ్యాంకులు సంతకాన్ని తీసుకుంటాయి. పూర్తిగా పారదర్శకత కోసమే ఈ సంతకాన్ని తీసుకుంటాయి.

Read Also: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

సురక్షితమైన లావాదేవీల కోసమే!

సంతకం చేయడం వలన చెక్కు సరైన వ్యక్తి ద్వారా అందిందని బ్యాంకు గ్రహిస్తుంది. లావాదేవీ అధికారిక రికార్డును మెయింటెన్ చేస్తుంది. ఏదైనా వివాదం సంభవించినప్పుడు ఈ రికార్డు సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. చెక్కు పోయినా, దొంగిలించబడినా దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ప్రతి సంతకాన్ని జాగ్రత్తగా గమనిస్తారు బ్యాంకు అధికారులు. తప్పు సంతకం డబ్బుల బదిలీ విషయంలో ఇబ్బందులు కలిగిస్తుంది. చెక్కు వెనుక సంతకం చేయడం ఒక చట్టపరమైన, భద్రతా చర్య, ఇది లావాదేవీలను సురక్షితంగా, చట్టబద్ధంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.

Read Also: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

Related News

Tata Sierra SUV: రెండు వెర్షన్లలో టాటా సియెర్రా, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Google Fined: గూగుల్ కు షాక్, రూ. 300 కోట్లు జరిమానా విధించిన ఆస్ట్రేలియా!

జియో షాకింగ్ నిర్ణయం.. ఆ రిచార్జ్ ప్లాన్‌ తొలగింపు? ఇలాగైతే కష్టమే!

DMart vs Metro: డిమార్ట్, మెట్రో.. ఏ స్టోర్ లో సరుకులు చౌకగా దొరుకుతాయంటే?

Ola Super Bike: ఓలా నుంచి సూపర్ బైక్, ధర రూ.5 లక్షలు.. భారత్ లో ఎంట్రీ ఎప్పుడంటే?

Big Stories

×