Big Stories

Today Gold Rates: ప్రస్తుతం చాలా మంది బంగారం గురించే ఆలోచిస్తున్నారంటా..! ఎందుకో తెలుసా..?

Gold Price Today: ప్రస్తుతం ఏ ఇంట్లోనైనా ఏదైనా శుభకార్యం జరుగబోతుందంటే వాళ్లు కొంత ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వివాహ కార్యక్రమాలు ఉన్నవారిలో అయితే మరింతగా ఉంది. ఎందుకంటే శుభకార్యాలల్లో బంగారం వాడుతుంటారు. వివాహ కార్యక్రమాల్లో అయితే మస్ట్ గా ఉంటుంది. కానీ, బంగారం ధర మాత్రం రోజురోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దీంతో వారికి టెన్షన్ తప్పడంలేదు.

- Advertisement -

గత కొద్ది రోజుల నుంచి పసిడి ధర తగ్గడంలేదు. రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అయితే, గతంతో పోలిస్తే ఈసారి పసిడి ధరలు వేరుగా ఉన్నాయి. గతంలో అయితే తగ్గేవీ.. కానీ, ఈసారి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారు ఆందోళన చెందుతున్నారు. ఇగ సామాన్యుడికైతే బంగారం కొనాలన్న ఆలోచనే కష్టంగా మారింది. ప్రస్తుతం బంగారం ధర తులానికి రూ. 76,000 వరకు ఉంది. అయితే, ధరల్లో హెచ్చుతగ్గులు ఉండడంతో కేవలం కొనుగోలుదారులే కాదు.. విక్రయదారులు, స్వర్ణకారుల్లో సైతం ఆందోళన నెలకొని ఉంది. ధర పెరిగి కొనుగోలుదారుల సంఖ్య తగ్గడంతో వారికి పని తగ్గింది.

- Advertisement -

Also Read: ‘తగ్గేదేలే’ అంటున్న బంగారం..!

ప్రస్తుతం ఎవరి ఇంట్లో అయినా వివాహ కార్యక్రమాలు ఉన్నాయంటే వారు ముందుగా బంగారం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ‘బంగారం ప్రస్తుతం రేటు ఎంత ఉంది.. ఇంకెంత పెరుగుతదో.. కేవలం బంగారానికే ఎంత ఖర్చవుతుందో’ అని ఆందోళన చెందుతున్నారు. ఇగ చేసేది లేక తక్కువ పరిణామంలో బంగారం కొంటున్నారు. ఇక సామాన్యులైతే బంగారం అంటేనే వణుకుతున్నారు. అయితే, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News