Big Stories

Gutta Comment on BRS: గుత్తా సంచలన వ్యాఖ్యలు.. అంతర్గత కలహాలతో..?

Gutta Sukender Comment on BRS: తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది?  అంతర్గత కలహాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయా? పార్టీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందా?  కారు పార్టీ ఫినిష్ అయిపోయినట్టేనా? ఇలా రకరకాల ప్రశ్నలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. తాజాగా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

- Advertisement -

తెలంగాణ ఏర్పడి పదేళ్లుపాటు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ పాలనను చూసిన తెలంగాణ ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని పక్కన పెట్టేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గులాబీ పార్టీకి కష్టాలు రెట్టింపయ్యాయి. బీఆర్ఎస్‌ పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉండలేక కారు దిగిపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వైపు వెళ్లిపోతున్నారు. ఇప్పటివరకు రెండొంతుల మంది వెళ్లిపోయారన్నది ఆ పార్టీ అంచనా.

- Advertisement -

బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వంపై నేతలకు విశ్వాసం పోయిందని, అందుకే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కేసీఆర్ కోటరీ వల్లే ఆ పార్టీ ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యమకారుల పేరుతో ఆ పార్టీలోకి వచ్చినవాళ్లు చాలామంది కోటీశ్వరులయ్యారని తెలిపారు. ఆ పార్టీకి ప్రజలు పూర్తిగా దూరమయ్యారన్నది ఆయన చెప్పిన మాట. ఐదారు జిల్లాల్లో పార్టీ బాగా డ్యామేజ్ అయ్యిందని గుర్తుచేశారు. గత మంత్రుల పనితీరు ఇందుకు కారణం కావచ్చని సూచనప్రాయంగా మనసులోని మాట బయటపెట్టారు. ఎన్నికలకు ఆరునెలల ముందు నుంచి కేసీఆర్ ఎవ్వరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నది ఆయన మాట.

Also Read: హైదరాబాద్ లో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా..!

బీఆర్ఎస్ పార్టీలోని లోపాలను ఎత్తి చూపుతూ మండలి ఛైర్మన్ గుత్తా చేసిన కామెంట్స్‌పై ఆ పార్టీలో అప్పుడే దుమారం మొదలైంది. ఈసారి నల్గొండ లోక్‌సభ బరిలో గుత్తా సుఖేందర్ కొడుకు అమిత్ పోటీకి దిగాలని భావించారు. తాను రేసులో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మరి ఏమైందోగానీ ఆయన పేరు వినబడ లేదు. నేతల నిరాకరణతోనే అమిత్ పోటీ నుంచి డ్రాపైనట్లు చెప్పుకొచ్చారు గుత్తా. మరి గుత్తా మాటల వెనుక అసలు రహస్యం ఏంటని చర్చించుకోవడం ఆ పార్టీలోని నేతల వంతైంది.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన చాలామంది నేతలు తమ సొంతగూటికి చేరుకున్నారు. గుత్తా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆయన కూడా కారు దిగేస్తారా? అంటూ చర్చించుకోవడం నేతల వంతైంది. ఏమో పార్లమెంటు ఎన్నికల లోపు తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News